Friday, March 6, 2026
Homeక్రీడలుకడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ.. ఆ ప్లేయర్ కు అవకాశం?

కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన అభిషేక్ శర్మ.. ఆ ప్లేయర్ కు అవకాశం?

క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా జట్టు చాలా బలంగా కనిపిస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. జట్టులోని ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో ఈసారి టి20 వరల్డ్ కప్ ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా టీమ్ ఇండియాకు ఒక షాకింగ్ న్యూస్ తగిలింది. భారత జట్టు డాషింగ్, విధ్వంసకర ఓపినర్ అభిషేక్ శర్మ కడుపు నొప్పితో తాజాగా ఆసుపత్రిలో చేరారు. ఆదివారం రోజున ఢిల్లీలో గౌతమ్ గంభీర్ ఇంటికి డిన్నర్ కు వెళ్లినటువంటి అభిషేక్ శర్మ.. మధ్యలోనే కడుపు నొప్పితో అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా క్రీడా వర్గాలు తాజాగా ప్రకటించాయి. ఇక ఆ తరువాత వెంటనే ఆసుపత్రిలో చేరగా… ఈరోజు కూడా అక్కడే ఉండి చికిత్స పొందే అవకాశాలు ఉన్నాయి అని సమాచారం. దీంతో రేపు నమీబియాతో జరగబోయేటువంటి మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఆడడం కాస్త అనుమానం గానే ఉందని సమాచారం. ఒకవేళ రేపు నమీబియా తో జరగబోయేటువంటి మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆడకపోతే అతను స్థానంలో సంజు సాంసన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటే ఫిట్నెస్ ఆధారంగా ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడంపై ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరి అతని కడుపునొప్పి ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అభిషేక్ శర్మ హెల్త్ అప్డేట్స్ ఇవ్వాలి అని ఇప్పటికే అతని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు.

శ్రీశైలంలో భక్తులపై లాఠీ చార్జి.. బీజేపీ ప్రెసిడెంట్ రియాక్షన్ ఇదే?

సింగరేణి రిటైర్ట్ కార్మికుల‌కు 10వేలు పెంచాలి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments