క్రైమ్ మిర్రర్, సినిమా:- ఫోక్ డ్యాన్సర్‌గా సోషల్ మీడియా, యూట్యూబ్‌లో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు కథానాయికగా సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇప్పటికే తమిళంలో లవ్ ఓ లవ్ చిత్రంలో నటించిన ఆమె, త్వరలో ఇడుపు కాయితం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, కెరీర్ లక్ష్యాలు, అభిమాన హీరో గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.నాగదుర్గ మాట్లాడుతూ… ప్రస్తుతం ఎక్కువ సినిమాలు హీరో చుట్టూనే తిరుగుతున్నాయని, కథానాయికలకు సమాన ప్రాధాన్యం దక్కే కథలు చాలా అరుదుగా వస్తున్నాయని అభిప్రాయపడింది. ఒక పాత్ర చేయాలంటే అందులో బలమైన ప్రాధాన్యం ఉండాలని, ప్రేక్షకులు తనను అందంగా కనిపించిందని కాకుండా మంచి నటిగా గుర్తించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
సినీ ప్రయాణంలో తాను ఎక్కువ సినిమాలు చేయడమే లక్ష్యం కాదని, తక్కువ సినిమాలైనా మంచి కథలతో, విభిన్న పాత్రలతో గుర్తింపు సంపాదించాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. వివిధ జానర్లలో నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకోవాలన్నదే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
నార్వేలో రొమాంటిక్ ప్రపోజల్.. ప్రముఖ దర్శకుడి కూతురు నిశ్చితార్థం.. వీడియో వైరల్!
తనకు స్ఫూర్తినిచ్చిన నటీమణుల్లో స్నేహ, సాయి పల్లవి ఉన్నారని నాగదుర్గ తెలిపింది. స్నేహ వైవిధ్యమైన పాత్రల ఎంపిక, సాయి పల్లవి స్క్రిప్ట్ సెలెక్షన్ తనకు ఎంతో ఇష్టమని చెప్పింది. టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవచ్చని అభిప్రాయపడింది.ఇంటర్వ్యూలో తన అభిమాన హీరో గురించి కూడా నాగదుర్గ ఆసక్తికరంగా స్పందించింది. తాను ఆ హీరోకు పెద్ద అభిమానినని, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే అంగీకరిస్తానని చెప్పింది. అలాంటి అవకాశం వస్తే ఎంతో ఆనందంగా స్వీకరిస్తానని వెల్లడించింది.అలాగే ఇడుపు కాయితం సినిమా టైటిల్ చుట్టూ నెలకొన్న వివాదంపైనా స్పందించిన ఆమె, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే అసలు విషయం అర్థం చేసుకుంటారని పేర్కొంది.
ఫోక్ డ్యాన్స్ వేదిక నుంచి హీరోయిన్‌గా అడుగుపెడుతున్న నాగదుర్గ ప్రయాణంపై ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఆమె తొలి తెలుగు చిత్రం ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
Manmohan Singh: మన్మోహన్ సింగ్ ఆత్మహత్య చేసుకుంటానన్నారా? మాజీ సీఈసీ షాకింగ్ కామెంట్స్!