Homeసినిమాఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు విజయ్ 'జననాయగన్'మూవీ.. ఎప్పుడంటే?

ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు విజయ్ ‘జననాయగన్’మూవీ.. ఎప్పుడంటే?

క్రైమ్ మిర్రర్, సినిమా:- తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ విడుదలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సెన్సార్ వివాదాలు, కోర్టు కేసుల కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా జులై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ విషయాన్ని యూకే డిస్ట్రిబ్యూటర్ అధికారికంగా ధృవీకరిస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. జులై 24న ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు సినిమాను విడుదల చేయనున్నట్లు ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, యూకే ప్రేక్షకులకు ఒక ప్రత్యేకతను అందిస్తూ, అక్కడ అన్‌కట్ వెర్షన్‌ను ప్రదర్శించనున్నట్లు కూడా ప్రకటించారు.వాస్తవానికి ఈ సినిమా ఈ ఏడాది జనవరిలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, తదనంతరం కోర్టు విచారణల కారణంగా విడుదల పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. ఈ పరిణామాలు విజయ్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాయి.విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నేపథ్యంలో, ఇది ఆయన నటించిన ఆఖరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జులై 24 కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మాస్క్ తో మంత్రి బస్సు ప్రయాణం… చిల్లర లేవన్నందుకు దిగిపోమన్న కండక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

షాబాద్ ఆరుగురు హత్యల కేసు: నిందితుడి ఆచూకీ తెలిపితే రూ.2 లక్షల బహుమతి

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు