క్రైం మిర్రర్ : మార్కాపురం జిల్లా కంభం సమీపంలో అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకకు ఆటోలో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన బంధువులను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహా నలుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యులు పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆటోలో కంభం వైపు బయలుదేరారు. అర్ధరాత్రి సమయంలో రహదారి పక్కన ఆటోను నిలిపారు. కొందరు ఆటోలోనే ఉండగా, అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఒక చిన్నారిని వెంటనే మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆ చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది.
ప్రమాదంలో గాయపడిన మరో ఏడుగురిని స్థానికులు, పోలీసులు వెంటనే రక్షించి మార్కాపురం, ఒంగోలు ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
also read :వియత్నాంలో బోటు ప్రమాదం.. 15 మంది భారతీయుల దుర్మరణం!