క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. ఏకంగా 1,605 రోజుల సుదీర్ఘ కాలం తర్వాత భారత్ తన నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 4-0 తేడాతో పరాజయం పాలవ్వడంతో భారత్ అగ్రస్థానం నుండి రెండవ స్థానానికి పడిపోయింది. ఒక టీ20 సిరీస్ లేదా టోర్నమెంట్‌లో భారత జట్టు 3 కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్‌పై సాధించిన ఈ సిరీస్ విజయంతో ఇంగ్లండ్ జట్టు టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల ఫీల్డింగ్ ప్రదర్శనను (క్యాచ్ ఎఫిషియెన్సీ) పరిశీలిస్తే.. ఇంగ్లండ్ 85.2% తో మెరుగ్గా ఉండగా, భారత జట్టు క్యాచ్ ఎఫిషియెన్సీ కేవలం 72.2% గా మాత్రమే నమోదు కావటం గమనార్హం.
శ్రీవారి దయతోనే ‘లెనిన్’ విజయం: సక్సెస్ మీట్‌లో భావోద్వేగానికి గురైన నాగార్జున!
ఫిన్లాండ్‌లో అదృశ్యమైన తెలుగు విద్యార్థి మృతి? అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబీకులు!