క్రైమ్ మిర్రర్, సినిమా:- అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన అక్కినేని నాగార్జున మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. సినిమా విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు అఖిల్ కెరీర్‌లో మంచి హిట్ సాధించాలని తాను తొలిసారిగా తిరుమల శ్రీవారిని కోరుకున్నానని నాగార్జున తెలిపారు. స్వామివారి దైవానుగ్రహంతోనే ఈ సినిమాకు ఇంతటి విజయం దక్కిందని ఆయన కృతజ్ఞతా భావం వ్యక్తం చేశారు. ‘లెనిన్’ చిత్రానికి తన వాయిస్ ఓవర్ అందించి సినిమాకు మరింత బలాన్నిచ్చిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు నాగార్జున ఈ వేదికగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ తనకు రెండు కళ్ళతో సమానమని నాగార్జున ప్రేమగా అభివర్ణించారు. గత ఏడాది నాగ చైతన్య నటించిన ‘తండేల్’ సినిమా సక్సెస్ మీట్‌కు హాజరైన తాను, ఇప్పుడు అఖిల్ ‘లెనిన్’ సక్సెస్ మీట్‌కు రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని నాగ్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఫార్చ్యూన్ ఇండియా ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’: సత్తా చాటిన తెలుగు మహిళలు!
జగన్ నమ్ముకున్నది గొడ్డలిని, సోషల్ మీడియానే అంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం!