Homeవైరల్ఓటీటీలో 'పెద్ది' మూవీ స్ట్రీమింగ్.. చరణ్ క్రికెట్ షాట్స్‌పై నెటిజన్ల ట్రోల్స్!

ఓటీటీలో ‘పెద్ది’ మూవీ స్ట్రీమింగ్.. చరణ్ క్రికెట్ షాట్స్‌పై నెటిజన్ల ట్రోల్స్!

క్రైమ్ మిర్రర్,సినిమా:- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టగానే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో చరణ్ క్రికెట్ ఆడే శైలి, ఆయన కొట్టే షాట్లపై నెటిజన్లు మీమ్స్ తో విరుచుకుపడుతూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా “క్రికెట్ ఇంగ్లండ్‌లో పుడితే.. తెలుగు సినిమాలో చనిపోయింది” అంటూ దారుణంగా విమర్శిస్తున్నారు. సాధారణంగా క్రికెట్ మైదానంలో నలువైపులా షాట్లు కొట్టే ఆటగాళ్లను ‘మిస్టర్ 360’ అంటుంటారని, కానీ ఈ మూవీలో చరణ్ ఆడిన షాట్లు చూస్తే ఏకంగా ‘మిస్టర్ 720’ని చూపించారని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. భౌతిక శాస్త్రానికి, లాజిక్‌కు ఏమాత్రం సంబంధం లేని విధంగా ఈ షాట్లు ఉన్నాయని ఎద్దేవా చేస్తున్నారు.ఓటీటీలో సీన్ల మార్పు..క్రికెట్ షాట్ల మీదే కాకుండా, సినిమాలో చేసిన కొన్ని మార్పుల పైనా చర్చ నడుస్తోంది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు.. ఓటీటీ వెర్షన్‌లో కొన్ని మార్పులు జరిగాయని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో తీవ్ర విమర్శలపాలైన జాన్వీ కపూర్ ‘కాటుక అక్కర్లేని కళ్ళు..’ డైలాగ్ ఉన్న సీన్‌తో పాటు, మరికొన్ని సన్నివేశాలను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వెర్షన్‌లో మార్చేశారని లేదా కుదించారని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ తర్వాత ఈ రేంజ్‌లో నెగెటివ్ ట్రోల్స్ రావడం హాట్ టాపిక్‌గా మారింది.

బంగ్లా మాజీ ప్ర‌ధాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…! బ‌తికినా, చ‌నిపోయినా సొంత‌గ‌డ్డ‌పైనే…!

ఎల్‌నినో ఎఫెక్ట్‌…! తెలంగాణ‌లో మినీ సమ్మర్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు