Homeక్రైమ్గూగుల్ డ్రైవ్‌లో 15 మంది యువతుల ప్రైవేట్ వీడియోలు.. యువకుడి అరెస్ట్ – టెక్నాలజీతో నేరానికి...

గూగుల్ డ్రైవ్‌లో 15 మంది యువతుల ప్రైవేట్ వీడియోలు.. యువకుడి అరెస్ట్ – టెక్నాలజీతో నేరానికి చెక్!

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడి గూగుల్ డ్రైవ్‌లో అనుమానాస్పదంగా నిల్వచేసిన ప్రైవేట్ వీడియోలు, ఫోటోలను గూగుల్ గుర్తించడం తో ఈ విషయం బయటపడింది. సమాచారం ప్రకారం, అతడి అకౌంట్‌లో సుమారు 15 మంది యువతుల వ్యక్తిగత వీడియోలు, చిత్రాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు.

ఈ విషయాన్ని గూగుల్ సంస్థ సంబంధిత అధికారులకు తెలియజేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. టెక్నికల్ సాయంతో ఆ అకౌంట్‌కు సంబంధించిన IP అడ్రస్, IMEI నంబర్‌లను ట్రేస్ చేసి, నిందితుడి స్థానాన్ని గుర్తించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో, యువకుడు ఆ యువతులతో పరిచయం పెంచుకుని, వారి విశ్వాసాన్ని దుర్వినియోగం చేసి ఈ కంటెంట్‌ను సేకరించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనతో సైబర్ భద్రతపై మళ్లీ చర్చ మొదలైంది. వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్‌లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సోషల్ మీడియా, క్లౌడ్ స్టోరేజ్ సేవలను ఉపయోగించే సమయంలో ప్రైవసీ సెట్టింగ్స్‌ను కచ్చితంగా పరిశీలించడం అవసరమని హెచ్చరిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేసే ముందు పూర్తిగా నమ్మకమైన వ్యక్తులనే ఎంచుకోవాలి. అనుమానాస్పద లింకులు, అపరిచితుల అభ్యర్థనలు అంగీకరించకూడదు. క్లౌడ్ స్టోరేజ్‌కు బలమైన పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి.

also read: ఏటీఎం కార్డు ఉన్నవారికి శుభవార్త.. రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా – ఎలా పొందాలి?

తాజావార్తలు