Homeతెలంగాణరైస్ మిల్లర్ల దందా....!

రైస్ మిల్లర్ల దందా….!

  • కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట ప్రభుత్వ ధాన్యం పక్కదారి

  • రూ.6700 కోట్ల భారీ కుంభకోణం

  • ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రైస్ మిల్లర్ల అక్రమాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కస్టమ్ బిల్డింగ్ రైస్ పేరిట ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన అక్రమార్కులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ ధాన్యాన్ని కాజేసి.. బియ్యం తిరిగి అప్పగించని రైస్ మిల్లర్లపై ఈడి మరిన్ని మనీలాండరింగ్ కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 2021-22 ఖరీఫ్ సీజన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.6700 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టినట్లు విచారణ సంస్థలు గుర్తించాయి. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, అక్రమ ఆస్తుల కూడబెట్టడంపై ఈడి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.

అలా పక్కదారి…

వాస్తవానికి రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తుంది. నిబంధనల ప్రకారం బియ్యం తయారుచేసి తిరిగి ప్రభుత్వాన్ని అప్పగించాల్సిన మిల్లర్లు ఆ ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకుని సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పౌరసరఫరాల శాఖ నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు మాయమైనట్లు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఆ ఎఫ్ ఐ ఆర్ ల ఆధారంగా రంగంలోకి దిగిన ఈ డి.. భారీ స్థాయిలో నిధులు మళ్లింపు జరిగినట్లు ఆధారాలు సేకరించింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

డిఫాల్టర్ రైస్ మిల్లర్లపై…

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మెదక్ తదితర ప్రాంతాల్లోని డిఫాల్టర్ రైస్ మిల్లుల జాబితాను జల్లెడ పడుతున్నారు. ధాన్యాన్ని అమ్ముకొని ఆ డబ్బుతో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాల వివరాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు బడా మిల్లర్లకు సమన్లు జారీ చేసి విచారణ జరుపుతున్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేసే దిశగా ఈడీ కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఇందులో కొందరు అధికారులు, రాజకీయ నేతల ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.

అక్రమార్కుల్లో ఆందోళన…

తెలంగాణలో రైస్ మిల్లర్ల దందా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయలు నష్టం కలిగించిన రైస్ మిల్లింగ్ మాఫియా పై ఈడి దూకుడు పెంచింది. అక్రమార్కుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం బకాయిల వసూలుకు కట్టిన నిబంధనలు అమలు చేస్తుండగా.. ఇంకోవైపు ఈడి మనీ ల్యాండరింగ్ కేసులతో ఉచ్చు బిగిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కుంభకోణానికి సంబంధించి సంచలనాలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఆస్తుల జప్తులతో పాటు అరెస్టులు కూడా జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే సంచలనం నమోదు కావడం ఖాయం.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కరీంనగర్ గడ్డపై బండి సంజయ్ గర్జన.. జైశ్రీరామ్’ నినాదంతో హోరెత్తిన సభ!
  2.  ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. యశ్ దయాళ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  3. బియ్యం ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్రం కీలక యోచన
  4.  18 టెక్నాలజీ ఫార్మాట్లలో ‘వారణాసి’.. ప్రపంచ సినీ ప్రేక్షకుల కోసం రాజమౌళి భారీ ప్లాన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు