Homeతెలంగాణరైతుల సంక్షేమానికి పీఏసీఎస్ కమిటీ కృషి చేయాలి...! ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

రైతుల సంక్షేమానికి పీఏసీఎస్ కమిటీ కృషి చేయాలి…! ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి (వెల్దండ),క్రైమ్ మిర్రర్: రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, సహకార సేవలు అందుబాటులోకి తీసుకెళ్లడంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. వెల్దండ మండల కేంద్రంలో సోమవారం గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సింగిల్ విండో చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీఏసీఎస్ పాలకవర్గం రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రైతుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేస్తూ సహకార సంఘంపై రైతులకు నమ్మకం కలిగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నూతన చైర్మన్‌గా యెన్నం భూపతిరెడ్డి, వైస్ చైర్మన్‌గా బాణావత్ శంకర్ నాయక్‌తో పాటు డైరెక్టర్లుగా వెంకట్ రెడ్డి, కొయ్యల పుల్లయ్య, శ్రీనివాసులు, గంగాధారి మల్లేష్, పెద్ది రామకృష్ణ, కల్వ యాదమ్మ, శాల్వాది కలమ్మ, లాలూ నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. పీఏసీఎస్ కార్యదర్శి శ్రీనివాస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నూతన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ బాలాజీ సింగ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మనీల సంజీవ్ కుమార్ యాదవ్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, కృష్ణారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, పర్వత రెడ్డి, మోతిలాల్ నాయక్, రామచంద్ర రెడ్డి, సాయి రెడ్డి, వెంకట్ రెడ్డి, మండల గిరిజన సంఘం అధ్యక్షుడు అజిత్ నాయక్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కరీంనగర్ గడ్డపై బండి సంజయ్ గర్జన.. జైశ్రీరామ్’ నినాదంతో హోరెత్తిన సభ!
  2.  ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. యశ్ దయాళ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  3. బియ్యం ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్రం కీలక యోచన
  4.  18 టెక్నాలజీ ఫార్మాట్లలో ‘వారణాసి’.. ప్రపంచ సినీ ప్రేక్షకుల కోసం రాజమౌళి భారీ ప్లాన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు