Homeతెలంగాణతెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫొక‌స్‌...! ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు...

తెలంగాణ కాంగ్రెస్‌పై అధిష్టానం ఫొక‌స్‌…! ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు…

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి పై సీరియస్

  • చర్యలకు ఉపక్రమించే అవకాశం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం పూర్తిగా దృష్టి పెట్టింది. ఇటీవల పార్టీలో అసమ్మతి గళాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత ప్రభుత్వం పైనే విమర్శలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం రేవంత్ పై విరుచుకుపడుతున్నారు. దీనిపై టిపిసిసి కూడా దృష్టి పెట్టింది. మరోవైపు ఈ ఇద్దరు తీరు పై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు.. ఆ ఇద్దరూ లక్ష్మణ రేఖను దాటి మాట్లాడినట్టు వచ్చిన ఫిర్యాదులను తాను టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వివరించానని.. ఆయన ఆ విషయాన్ని ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఇటీవల ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ విధానాలు, నాయకత్వంపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ నూతన వ్యవహారాల ఇంచార్జ్ సందీప్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఈ ఇద్దరిపై చర్యలు తప్పవని సంకేతాలు వెలువడుతున్నాయి.

కొత్త ఇన్చార్జ్ బాధ్యతలు…

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా బిఎం సందీప్ నియమితులైన సంగతి తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన ఆయన కాంగ్రెస్ పార్టీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, నేతల మధ్య ఉన్న సమీకరణలు, అసంతృప్తికి గల కారణాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాలతో పాటు అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేతలతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించినందుకే అధిష్టానం ప్రాధాన్యం ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఆ కారణాలతోనే…

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా రెండోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సైతం మెజారిటీ ఎంపీ స్థానాలను పొందాలని చూస్తోంది. ఇటువంటి సమయంలో క్రమశిక్షణ కట్టు దాటిన నేతలపై వేటు వేసేందుకు సిద్ధపడుతోంది. అయితే తక్షణమే వేటు వేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం కంటే భవిష్యత్తులో ఎవరైనా మరోసారి గీత దాటి బహిరంగ విమర్శలకు దిగితే మాత్రం.. ఉపేక్షించేది లేదన్న బలమైన సంకేతాలను ఏఐసీసీ పంపించనుందని పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు లేదా అభిప్రాయ భేదాలు ఏవైనా ఉంటే వాటిని పార్టీ వేదికలపై చర్చించాలని.. బహిరంగ వేదికలపై మాట్లాడడం వల్ల ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చినట్లు అవుతుందని పిసిసి నాయకత్వం స్పష్టం చేస్తోంది. అయితే క్రమశిక్షణ ముందు అందరూ సమానమేనని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించడం తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం కలుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కరీంనగర్ గడ్డపై బండి సంజయ్ గర్జన.. జైశ్రీరామ్’ నినాదంతో హోరెత్తిన సభ!
  2.  ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. యశ్ దయాళ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  3. బియ్యం ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్రం కీలక యోచన
  4.  18 టెక్నాలజీ ఫార్మాట్లలో ‘వారణాసి’.. ప్రపంచ సినీ ప్రేక్షకుల కోసం రాజమౌళి భారీ ప్లాన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు