-
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
-
ఈవీఎంలతో ఎన్నికల్లో కూడా తిరుగులేని హస్తం
-
కోలుకోలేని దెబ్బకు గురైన కాషాయ పార్టీ
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: రాజస్థాన్ లో భారతీయ జనతా పార్టీకి . రాష్ట్రంలోని 37 జిల్లాలకు గాను ఏకంగా 33 జిల్లాల్లో కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం కనబరిచింది. ఫలితాల్లో పంచాయితీ సమితి స్థానాలకు గాను కాంగ్రెస్ 3701 చోట్ల విజయం సాధించగా.. అధికార బిజెపి 2181 స్థానాలకు పరిమితం అయింది. అలాగే జిల్లా పరిషత్ వార్డుల్లోనూ కాంగ్రెస్ 599 స్థానాలను కైవసం చేసుకుంది.. బిజెపి 301 స్థానాలతో వెనుకబడిపోయింది. చివరకు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ సొంత జిల్లా భరత్ పూర్ తో పాటు పలువురు మంత్రులు నియోజకవర్గాల్లోనూ బిజెపి అభ్యర్థులు ఓటమి చవిచూశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇది పెను ప్రకంపనలు సృష్టించింది.
ఈవీఎంలతోనే…
అయితే ఎన్నికల్లో విశేషం ఏమిటంటే.. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడమే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను వ్యతిరేకిస్తోంది. అయినా సరే కాంగ్రెస్ వైపు గ్రామీణ ప్రజలు చూస్తున్నారని అదే ఈవీఎంల ద్వారా స్పష్టమైంది. వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. కానీ రాజస్థాన్లో మాత్రం అందుకు భిన్నంగా ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి పట్టు కోల్పోయింది. జైపూర్ వంటి కీలక జిల్లాల్లోని 22 పంచాయితీ సమితిలో 14 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ నియోజకవర్గం లో 15 స్థానాలకు గాను బిజెపి కేవలం ఒక్క స్థానానికే పరిమితం కావడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.
వసుంధరను పక్కన పెట్టడం…
బిజెపి స్వయంకృతాపంతోనే ఈ ఫలితాలు అని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రవ్యాప్తంగా బలమైన ప్రజాధరణ ఉన్న సీనియర్ నేత వసుంధర రాజేను పక్కన పెట్టారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్ లాల్ శర్మకు సీఎం పీఠం అప్పగించారు. ఇది ముమ్మాటికి తప్పిదం అని ఎన్నికల ఫలితాలు తేల్చాయి. రాష్ట్రంలో నాయకత్వం లేని, పాలనాపరమైన స్తబ్దత ఏర్పడడం వల్లే గ్రామీణ ఓటర్లు బిజెపికి దూరమయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
