Homeఆంధ్ర ప్రదేశ్కైలాసగిరి కి కొత్త రోప్ వే...!

కైలాసగిరి కి కొత్త రోప్ వే…!

  • 22 ఏళ్ల కిందట ఏర్పాటు

  • గడువు ముగియడంతో కొత్తది నిర్మాణం

  • పర్యాటకులకు లూజ్ గ్రావిటీ రైడ్ తో సరికొత్త అనుభూతి

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: విశాఖ నగరానికి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. నవంబరు నుంచి జనవరి వరకు పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విశాఖ నగరం తో పాటు అరకు, పాడేరు, లంబసింగి వంటి ప్రాంతాలకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు విశాఖను ఆశ్రయిస్తుంటారు. ఈ తరుణంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో విశాఖ నగరంలో పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కైలాసగిరి కి కొత్త రోప్ వే నిర్మించే దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు 20 ఏళ్లుగా ఉన్న పాత రోప్ వేను తొలగించి.. కొత్త రోప్ వే ఏర్పాటు చేసేందుకు గత ఏడాది నుంచి టెండర్లు పిలుస్తున్న ఎవరూ ముందుకు రాలేదు. అప్పటినుంచి టెండర్ల ప్రక్రియ పెండింగ్లో ఉంది. ఇటీవల బోర్డు సమావేశంలో ప్రస్తుత కాంట్రాక్టర్ ఎల్.1 గా నిలవడంతో.. వారికే పనులు అప్పగించడానికి ఆమోదం తెలిపారు. త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రెండు దశాబ్దాల కిందట…

22 సంవత్సరాల కిందట విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ పర్యాటకుల కోసం వినూత్నంగా ఆలోచించింది. 2004లో కైలాసగిరి వెళ్లేందుకు మెట్లు, రోడ్డు మార్గం కాకుండా రోప్ వేను అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్పట్లో మూడు కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేశారు. 2004 నాటి రోప్ వే 20 ఏళ్ల పాటు గడువు విధించారు. ఇప్పుడు ఆ ఆ గడువు ముగిసి చాలా రోజులు అయింది. ప్రస్తుతం దాని నిర్వహణ సరిగ్గానే ఉంది. అయినా సరే ముందస్తు చర్యల్లో భాగంగా కొత్త రోప్ వే ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అయితే ఈసారి దాని విస్తరణ పెరగనుంది. కొండపై నుంచి తెలుగు మ్యూజియం ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు పెంచాలని ప్రతిపాదించారు.

సింగపూర్ తరహాలో…

ఈ కొత్త రోప్ వే కు సంబంధించి సింగపూర్ తరహాలోనే లూజ్ గ్రావిటీ రైడ్ ను ఏర్పాటు చేసేందుకు డిజైన్లు రూపొందించారు. కానీ టెండర్లు పిలిస్తే ఎవరూ ముందుకు రాలేదు. ఆ తరువాత ఒక్కటే టెండర్ వేశారు. వాళ్లు కూడా ఖర్చు ఎక్కువగా అవుతుందని భావించారు. ఆదాయంలో వాటా పెంచాలని కోరారు. ఈ క్రమంలో కొత్త రోప్ వే ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది. పాత రోప్ వే నడుపుతున్నారు. ఇంతలో గతంలో టెండర్ వేసిన సంస్థ నిర్మాణానికి ముందుకు వచ్చింది. అధికారులతో చర్చించిన తర్వాత ఎల్ 1 కింద ఆ సంస్థకే కాంట్రాక్ట్ ఖాయం చేశారు. త్వరలో పనులకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు కొత్త రోప్ వే లూజ్ గ్రావిటీ రైడ్ ని శివపార్వతుల విగ్రహం దగ్గర నుంచి 600 మీటర్ల పొడవు నా ఏర్పాటు చేస్తారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కైలాసగిరిని బెస్ట్ టూరిజం స్పాట్గా రూపొందిస్తామని వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. యలహంక ప్యాలెస్ వివాదం.. నేడే కీలక విచారణ!
  2.  బిస్లరీ వాటర్ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలం, చట్టపరమైన చర్యలకు సిద్ధమైన FSSAI!
  3.  భాగ్యనగరానికి ఉగ్ర హెచ్చరిక.. బాంబులు పెడతామంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్!
  4. ఉదయం అల్పాహారం ఆలస్యమైతే ఆయుష్షుకు ముప్పు.. జాగ్రత్త!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు