Homeతెలంగాణతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లో...?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లో…?

  • ఆరు నెలలు పొడిగించే ఆలోచనలో కేంద్రం

  • సార్వత్రిక ఎన్నికలతో పార్టీ నిర్వహణ

  • తెర వెనుక బిజెపి భారీ వ్యూహం…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లో జరుగుతాయా? బిజెపి జమిలీ అస్త్రం ప్రయోగించనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2028 నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై పట్టు కోసం తెలంగాణతో పాటు కర్ణాటకలో ఎన్నికలను 2029కి వాయిదా వేయాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో పాటు చట్ట సవరణల ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న వారి పదవీకాలం కొద్దికాలం పొడిగించడం.. లేకుంటే రాష్ట్రపతి పాలన విధించడం వంటి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

దక్షిణాది రాష్ట్రాల్లో…

ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో లేదు. కేవలం ఏపీలో మాత్రమే టిడిపి తో సయోధ్య ఏర్పాటు చేసుకొని అధికారంలోకి రాగలిగింది. అక్కడ కూడా ఆ పార్టీకి బలం తక్కువ. అయితే 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది బిజెపి. మరోసారి అక్కడ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలను ఆలస్యం చేసి 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటు నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ పై ఫుల్ ఫోకస్ చేసింది బిజెపి. అక్కడ ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది. అందుకే 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటు ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఓ ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించి తన మార్కు చూపించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రపతి పాలన…

తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బిజెపి అగ్ర నాయకత్వంలో ఒక రకమైన పునరాలోచన. అందుకే ముందుగా రాష్ట్రపతి పాలన విధించి.. 2029 సార్వత్రిక ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే సత్ఫలితాలు వస్తాయని బిజెపి అగ్ర నేతలు భావిస్తున్నారు. ఈ లోపు పార్టీలో చేరికలతో పాటు బలోపేతానికి కూడా ఒక మార్గం దొరుకుతుంది. అందుకే బిజెపి అగ్ర నేతలు తెలంగాణలో ఆరు నెలలపాటు ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపిలో విభేదాలు తొలగించడం, ప్రజల మధ్యకు వెళ్లడం, ప్రత్యేక అభివృద్ధి బాట పట్టడం వంటి వాటితో కేంద్రం తెలంగాణ ప్రజలకు మరింత దగ్గర కావాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలన్నీ చూస్తుంటే తెలంగాణలో కనీసం 6 నెలల పాటు అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. చూడాలి చివరకు ఏం జరుగుతుందో.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. యలహంక ప్యాలెస్ వివాదం.. నేడే కీలక విచారణ!
  2.  బిస్లరీ వాటర్ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలం, చట్టపరమైన చర్యలకు సిద్ధమైన FSSAI!
  3.  భాగ్యనగరానికి ఉగ్ర హెచ్చరిక.. బాంబులు పెడతామంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్!
  4. ఉదయం అల్పాహారం ఆలస్యమైతే ఆయుష్షుకు ముప్పు.. జాగ్రత్త!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు