Homeతెలంగాణహైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు కుట్ర? 26/11 తరహా దాడులంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్

హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు కుట్ర? 26/11 తరహా దాడులంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్

హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లు జరుపుతామంటూ పోలీసులకు వచ్చిన ఓ బెదిరింపు ఈమెయిల్ కలకలం రేపింది. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈ సందేశంలో ముంబయిలో జరిగిన 26/11 తరహా దాడులకు పాల్పడతామని హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యంగా కాచిగూడ రైల్వే స్టేషన్‌తో పాటు హోటల్ టూరిస్ట్ ప్లాజాను లక్ష్యంగా చేసుకుంటామని మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

తమ నేత లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా ఈ దాడులు చేపడతామని బెదిరింపు సందేశంలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ మెయిల్‌ను గుర్తించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నగర పోలీసులకు సమాచారాన్ని అందించి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.

దీంతో కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా పరిసరాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బెదిరింపు మెయిల్ వెనుక ఎవరున్నారు? నిజంగానే ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది.

బెదిరింపు మెయిల్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ హెచ్చరికకు సంబంధించి అధికారిక దర్యాప్తులో వెల్లడయ్యే వివరాల కోసం వేచి చూడాల్సి ఉంది.

also read: చిత్తూరులో రాజకీయ కలకలం.. వైసీపీ ఏకైక కార్పొరేటర్ హరిణి రాజీనామా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు