Homeసినిమాక్యాన్సర్‌ పోరాటంలో సల్మాన్ ఖాన్ అండ ఎంతో ధైర్యానిచ్చింది-  సోనాలి బింద్రే

క్యాన్సర్‌ పోరాటంలో సల్మాన్ ఖాన్ అండ ఎంతో ధైర్యానిచ్చింది-  సోనాలి బింద్రే

తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సోనాలి బింద్రే జీవితంలో క్యాన్సర్ రూపంలో ఊహించని కష్టం ఎదురైంది. 2018లో ఆమెకు నాలుగో దశ మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె చికిత్స కోసం అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, ఆత్మవిశ్వాసంతో వ్యాధిపై పోరాటం కొనసాగించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన క్యాన్సర్ చికిత్స రోజులను గుర్తుచేసుకున్న సోనాలి బింద్రే.. ఆ క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసినప్పటి నుంచి సల్మాన్ తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారని ఆమె తెలిపారు.

తనకు చికిత్స జరుగుతున్న సమయంలో సల్మాన్ ఖాన్ తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడేవారని, వైద్యులతోనూ సంప్రదింపులు జరిపి పరిస్థితిని తెలుసుకునేవారని సోనాలి వెల్లడించారు. ఆ సమయంలో ఆయన చూపించిన శ్రద్ధ, మద్దతు తనకు ఎంతో ధైర్యాన్నిచ్చాయని కృతజ్ఞతలు తెలిపారు.

క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధితో పోరాడుతున్న సమయంలో సన్నిహితుల నుంచి లభించే ప్రోత్సాహం ఎంతటి బలాన్నిస్తుందో తన అనుభవం ద్వారా సోనాలి వివరించారు. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆమె మళ్లీ సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. తన జీవితంలో ఎదురైన కఠినమైన అనుభవాన్ని అధిగమించి తిరిగి కెరీర్‌పై దృష్టి పెట్టిన సోనాలి ప్రయాణం పలువురికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

also read: బాలకృష్ణ పీఏకు చెందిన కంపెనీలో పోలీసుల సోదాలు.. భారీగా కర్రలు స్వాధీనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు