Homeఆంధ్ర ప్రదేశ్గోదావరి పుష్కరాలకు ప్రధాని మోదీ...!

గోదావరి పుష్కరాలకు ప్రధాని మోదీ…!

  • ప్రత్యేకంగా ఆహ్వానించిన చంద్రబాబు

  • ఏడాది పొడవునా పుష్కర స్నానాలు చేయాలని ప్రజలకు సూచన

  • ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు

  • రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : గోదావరి పుష్కరాలకు సమయం ఆసన్నం అవుతోంది. మరో ఆరు నెలల్లో గోదావరి పుష్కర వేడుకలు జరగనున్నాయి. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు పుష్కరాలు కొనసాగునున్నాయి. పుష్కర ఏర్పాట్లకు సంబంధించి రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. 440 ఘాట్ల అభివృద్ధి, 4000 ప్రత్యేక బస్సులు, 1560 రైళ్ల ఏర్పాటు పై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు గోదావరి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రధాని మోదీ రానున్న దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నమో గోదావరి పేరుతో వినూత్న కార్యక్రమాలు కూడా చేపట్టాలని ఆదేశించడం విశేషం.

ఏడాది కిందటి నుంచి కార్యాచరణ…

గోదావరి పుష్కరాలను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడాది కిందట నుంచి ఏర్పాట్లు మొదలు పెట్టింది. గత అనుభవాల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచమంతా ఏపీ వైపు చూసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం సైతం తన వంతు సహాయం అందిస్తోంది. అయితే ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. దీంతో ప్రధాని వచ్చేందుకు సుముఖత చూపారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులంతా ఏపీకి రానున్నారు. అందుకే సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నమో గోదావరి పేరుతో భారీగా కార్యక్రమాలు చేపట్టాలని కూడా ఆదేశించారు. గోదావరి పుష్కరాలు అంటే 12 రోజులు మాత్రమే కాదు.. ఏడాది పాటు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించాలని ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సీఎం అధికారుల సమీక్షలో ఆదేశించారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు పర్యాటకంగానూ గోదావరి పుష్కరాలు దోహదపడాలని కూడా చెప్పుకొచ్చారు సీఎం చంద్రబాబు.

400 ఘాట్లలో స్నానాలు…

గోదావరి తీరంలో దాదాపు 400 ఘాట్లలో స్నానాలు ఆచరించే వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు నాలుగువేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. మరోవైపు భారత రైల్వే శాఖ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసింది. దేశం నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి 1560 రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఏపీఎస్ఆర్టీసీతో పాటు అన్ని రాష్ట్రాల రవాణా కార్పొరేషన్లు, ప్రైవేటు వాహనాలకు సంబంధించిన నాలుగు వేల ప్రత్యేక బస్సులు కూడా నడవనున్నాయి. మొత్తానికైతే ప్రధాని గోదావరి పుష్కరాలకు మరింత శోభ రానుంది. కేంద్ర ప్రభుత్వం సైతం.. ఈ గోదావరి మహా పండుగకు తమ వంతు సాయం అందించనుంది.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. యలహంక ప్యాలెస్ వివాదం.. నేడే కీలక విచారణ!
  2.  బిస్లరీ వాటర్ శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలం, చట్టపరమైన చర్యలకు సిద్ధమైన FSSAI!
  3.  భాగ్యనగరానికి ఉగ్ర హెచ్చరిక.. బాంబులు పెడతామంటూ పోలీసులకు బెదిరింపు మెయిల్!
  4. ఉదయం అల్పాహారం ఆలస్యమైతే ఆయుష్షుకు ముప్పు.. జాగ్రత్త!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు