-
ఉద్యోగులను తగ్గించుకుంటున్న దిగ్గజ సంస్థలు
-
వీధిన పడుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: సాఫ్ట్వేర్ రంగం సంక్షోభంలో పడింది. ఎక్కడికక్కడే లే ఆఫ్స్ ప్రకటిస్తున్నారు. ఆందోళనలో బాధిత కుటుంబాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ఒకలాంటి భరోసా ఉండేది. మంచి జీతంతో పాటు స్థిరమైన ఆదాయం లభించేది. కుటుంబానికి ఆర్థిక భద్రత కూడా ఉండేది. మధ్యతరగతి కుటుంబాల కలలకు సాఫ్ట్వేర్ రంగం ఒక మార్గం గా కనిపించేది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాల్లో వేలాది కుటుంబాలు ఈ రంగాన్ని ఆధారంగా చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చేతిలో మంచి ఉద్యోగం ఉన్నా రేపు ఉంటుందో లేదో తెలియదు పరిస్థితి. ఎప్పుడు తొలగింపు చేస్తారో నన్ను భయం వెంటాడుతోంది. ఒకప్పుడు ఉద్యోగులను ఆకర్షించేందుకు పోటీపడిన కంపెనీలే ఇప్పుడు సిబ్బంది సంఖ్యను తగ్గించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు కొత్త ఉద్యోగులను నియమించుకున్న సంస్థలు సైతం ఉన్నాయి.
దిగ్గజ కంపెనీలు సైతం…
ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు సైతం ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. క్వాల్ కామ్, ఇంటెల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజాల నుంచి.. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్ సి ఎల్ టెక్, టెక్ మహేంద్ర వంటి భారతీయ సంస్థల వరకు ఉద్యోగుల విషయంలో పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఇది కేవలం ఒకటి రెండు కంపెనీల సమస్య కాదు. ప్రపంచ సాంకేతిక రంగంలో వస్తున్న నిర్మాణాత్మక మార్పులకు సంకేతం. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగాల కోసం తీవ్రతను అర్థం చేసుకోవడానికి.. 2026 నాటి గణాంకాలను పరిశీలించాలి. నవంబరు 18 నాటికి అందుబాటులో ఉన్న ఒక అంతర్జాతీయ ట్రాకర్ ప్రకారం.. ఈ యాడాదిలో ఇప్పటివరకు 365 కంపెనీల్లో.. 1,594 18 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఇదే కాలంతో పోలిస్తే ఆ సంఖ్య 36.6% ఎక్కువ. ఇది ప్రైవేటు సంస్థ సేకరించిన ట్రాకర్ గణాంకం మాత్రమే. ప్రపంచంలోని అన్ని ఉద్యోగ కోతలను కలిపిన అధికారిక ప్రభుత్వ లెక్క కాదు. అయినా సరే సమస్య విస్తృతాన్ని తెలియజేస్తోంది. అమెరికాకు చెందిన క్వాల్ కామ్ సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. సంస్థ సీఈవో క్రిస్టియానో ఆమెన్ అక్టోబరు 24 ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో దీన్ని పెర్ఫార్మన్స్ ఫోకస్ రిడక్షన్ గా పేర్కొన్నారు. అయితే భారతదేశంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. మనీ కంట్రోల్ నవంబర్ 11న వెల్లడించిన సమాచారం ప్రకారం బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభం అయింది. దేశవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగులు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా.
ఇంటెల్ సంస్థలో ఇదే పరిస్థితి…
నవంబరు 17, 18 తేదీల్లో ఉద్యోగుల కోత విధించారు. ముఖ్యంగా గ్లోబల్ ఐటీ విభాగంలో ఉద్యోగులు ప్రభావితమైనట్లు సమాచారం. సెప్టెంబర్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 81, 100 కు తగ్గింది. 2025లో ఆ సంఖ్య 85,100 గా ఉండేది. గూగుల్ కూడా ఉద్యోగుల విషయంలో కొత్త విధానాన్ని అనుసరిస్తోంది. ఏఐ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న సమస్త నిర్వహణ వేయాలని నియంత్రించేందుకు కొన్ని దేశాల్లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాలను విస్తరించింది. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో ఈ అవకాశం కల్పించింది. మైక్రోసాఫ్ట్ జూలై 2026లో సుమారు 4800 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో 2.1%.. గత ఏడాది కాలంలో 4,000 మందికి పైగా ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ కూడా చేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నప్పటికీ భారతదేశంలోని ఐటీ రంగంలో పూర్తిగా ఒకే విధంగా లేదు. కొన్ని సంస్థలు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తుంటే.. మరికొన్ని సంస్థలు పెద్ద సంఖ్యలో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.
