ఖమ్మం జిల్లాలోని ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శ్రీవారినగర్‌కు చెందిన 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థి విష్ణువర్ధనాచారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. విష్ణువర్ధనాచారి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే తన ఎత్తు పెరగడం లేదనే ఆందోళనతో పాటు చదువులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాననే బాధతో కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో విష్ణువర్ధనాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన అతడి తండ్రి వేణుగోపాలాచారి తిరిగి ఇంటికి వచ్చేసరికి కుమారుడు విగతజీవిగా కనిపించాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతితో శ్రీవారినగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
also read: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం పేరుతో సైబర్ మోసం.. హైదరాబాద్ వ్యక్తికి రూ.8.23 లక్షల టోకరా!
