-
ఎన్విడియో సీఈఓ గా పునర్నియామకం
-
నిష్క్రమించిన పది రోజుల్లోనే తిరిగి అదే పదవిలోకి…
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం ఎన్విడియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ సహా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ ను తక్షణమే కంపెనీ ప్రెసిడెంట్ గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సభ్యుడిగా నియమిస్తున్నట్లు సోమవారం అధికారికంగా ప్రకటించింది. వరుస చర్చలు, సమావేశాల అనంతరం డైరెక్టర్ల బోర్డు యాకగ్రీవంగా ఓటు వేసి ఆయనను తిరిగి బాధ్యతల్లోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నవంబర్ 12న రాజీనామా చేసిన ఆయన కేవలం పది రోజుల వ్యవధిలోనే తిరిగి తన పదవిని చేపట్టడం టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనమే…
జెన్సన్ హువాంగ్ నిష్క్రమణ ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం. కేవలం లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయన పై వేటు పడింది. అయితే ఇప్పుడు పునర్ నియామకం జరగడం ఆశ్చర్యకర విషయం. అమెరికా ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి తమకు కీలక సమాచారం అందిందని బోర్డు తన ప్రకటనలో పేర్కొంది. ఆ సమాచారం ఆధారంగా హువాంగ్ తిరిగి సీఈవోగా బాధ్యతలు చేపట్టడం వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని బోర్డు పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం హువాంగ్ పునర్ నియామకాన్ని స్వాగతించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, ఎన్విడియా శ్రేయస్సు కోసం ఆయన నాయకత్వం అవసరమని పేర్కొనడం విశేషం.
బోర్డు సైతం విశ్వాసం…
బోర్డు సైతం జెన్సన్ హువాంగ్ పట్ల ప్రగాఢ నమ్మకాన్ని ప్రకటించింది. కంపెనీని నడిపించడానికి ఆయన సరైన వ్యక్తి అని స్పష్టం చేసింది. ఆయన తిరిగి రావడం వాటాదారులు, ఉద్యోగులు, భాగస్వామ్యులు, వినియోగదారుల ప్రయోజనాలకు ఎంతో మేలు చేస్తుందని ఎన్విడియా తెలిపింది. జెన్సన్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని.. ఆయన నాయకత్వంలో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ క్లిష్ట సమయంలో తాత్కాలిక సీఈవోగా అద్భుతమైన సేవలు అందించిన కొల్లెట్ క్రాస్ కు బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. ఆమె యొక్క పై ఎన్వీడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది.
