Homeతెలంగాణకోటి ఓట్లు.. 90 సీట్లు...! కాంగ్రెస్ లో కొత్త నినాదం ...

కోటి ఓట్లు.. 90 సీట్లు…! కాంగ్రెస్ లో కొత్త నినాదం …

  • సిఎం రేవంత్ కొత్త స్లోగన్

  • పార్టీ శ్రేణుల నోట ఇదే మాట

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. పట్టు బిగించాలని చూస్తోంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కీలక నినాదం ఇచ్చారు. కోటి ఓట్లు.. 90 సీట్లు.. ఇదే మా లక్ష్యం అంటూ సీఎం రేవంత్ గీసిన గీతను ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం, పిసిసి చీఫ్ సహా పార్టీ శ్రేణులన్నీ ఒక బలమైన రాజకీయ నినాదం అందుకున్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కోటి ఓట్లు సాధించడంతోపాటు 90 అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించి.. రెండోసారి అధికారంలోకి రావడమే ఏకైక అజెండాగా పార్టీ నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

ఆ సంఖ్య పెరగాలని…

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈసారి ఆ సంఖ్యను తొంబై కి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడంపై పిసిసి చీఫ్, మంత్రులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకు తీసుకెళ్లడం ద్వారా కోటి ఓట్ల మైలురాయి సులభంగా చేరుకోవచ్చని ధీమాతో ఉన్నారు.

సీఎం కీలక నినాదం…

ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దీని పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నారు. ఈ పదం క్యాచీగా ఉండడంతో నేతలంతా ఇదే పాత పాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ ఇచ్చిన ఈ కొత్త టార్గెట్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఒక దారి చూపినట్లు అయింది. ఎట్టి పరిస్థితుల్లో గులాబీ పార్టీకి, కాషాయ దళానికి అవకాశం ఇవ్వకూడదని గట్టి ప్రయత్నమే జరుగుతోంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కరీంనగర్ గడ్డపై బండి సంజయ్ గర్జన.. జైశ్రీరామ్’ నినాదంతో హోరెత్తిన సభ!
  2.  ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. యశ్ దయాళ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  3. బియ్యం ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్రం కీలక యోచన
  4.  18 టెక్నాలజీ ఫార్మాట్లలో ‘వారణాసి’.. ప్రపంచ సినీ ప్రేక్షకుల కోసం రాజమౌళి భారీ ప్లాన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు