Homeతెలంగాణఇన్‌స్టాగ్రామ్‌తో శ్రీలీల భారీ ఆదాయం... ఒక్క ప్రమోషనల్ పోస్ట్‌కే లక్షల్లో రెమ్యూనరేషన్...!

ఇన్‌స్టాగ్రామ్‌తో శ్రీలీల భారీ ఆదాయం… ఒక్క ప్రమోషనల్ పోస్ట్‌కే లక్షల్లో రెమ్యూనరేషన్…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు సెలబ్రిటీలకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు ప్రమోషనల్ పోస్టులు, సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ల ద్వారా కూడా ప్రముఖులు భారీగా సంపాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన శ్రీలీల, తొలుత కన్నడ చిత్రాలతో సినీ ప్రయాణం ప్రారంభించారు. అనంతరం పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్ వంటి అగ్రహీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ధనుష్ సరసన, బాలీవుడ్‌లో దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న చిత్రంలో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తున్నారు.

Also Read:ఇన్‌స్టాగ్రామ్‌తో శ్రీలీల భారీ ఆదాయం… ఒక్క ప్రమోషనల్ పోస్ట్‌కే లక్షల్లో రెమ్యూనరేషన్…!

సినిమాల్లో విజయాలు, అపజయాలు ఎలా ఉన్నా శ్రీలీలకు అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. నటనతో పాటు డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా ఆమెకు వరుస ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇక సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు, బ్రాండ్ ప్రచార కార్యక్రమాల్లోనూ ఆమె బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం శ్రీలీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 16.6 మిలియన్ల ఫాలోవర్లు*ఉన్నారు. ఈ భారీ ఫాలోయింగ్ కారణంగా అనేక ప్రముఖ బ్రాండ్లు ఆమెతో ప్రమోషనల్ పోస్టులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఫీజు అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై శ్రీలీల లేదా ఆమె టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.

Also Read:విశాఖ టేకీ రాధా గాయత్రి కేసులో కీలక మలుపు… భర్త శ్రీచరణ్‌కు నోటీసులు

ఇక సినిమాల విషయానికి వస్తే, ఒక్కో చిత్రానికి రూ.2 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదనంగా పలు ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ మరోవైపు భారీ ఆదాయం ఆర్జిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా ఫోటోలు, షూటింగ్ అప్‌డేట్స్, వ్యక్తిగత క్షణాలను అభిమానులతో పంచుకునే శ్రీలీల, సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్‌ను కొనసాగిస్తున్నారు. అయితే ఆమె ఆదాయానికి సంబంధించిన గణాంకాలు అధికారికంగా వెల్లడికాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ఆధారంగానే ఈ అంచనాలు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు