Homeఆంధ్ర ప్రదేశ్సముద్రంలో 13 రోజులుగా జాడలేని ఏడుగురు మత్స్యకారులు.. మయన్మార్, బంగ్లాదేశ్ వైపు వెళ్లారా?

సముద్రంలో 13 రోజులుగా జాడలేని ఏడుగురు మత్స్యకారులు.. మయన్మార్, బంగ్లాదేశ్ వైపు వెళ్లారా?

క్రైమ్ మిర్రర్ : సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు గల్లంతవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 11న వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అయితే ఈ నెల 14వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన వారు ఆ తర్వాత నుంచి అందుబాటులోకి రాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దాదాపు 13 రోజులుగా మత్స్యకారుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఏం జరిగిందో తెలియక కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. సముద్రంలో తుపాను ప్రభావం కారణంగా బోటు దారి తప్పి ఇతర దేశాల సముద్ర జలాల్లోకి వెళ్లి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా మయన్మార్ లేదా బంగ్లాదేశ్ వైపు కొట్టుకెళ్లి ఉండవచ్చనే కోణంలో పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే మత్స్యకారులకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు పంపించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

మత్స్యకారులను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని, కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. మరోవైపు కోస్టల్ సిబ్బంది నౌకలు, హెలికాప్టర్ల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురు మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ప్రార్థిస్తున్నారు.
also read : కార్తీక దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని మహిళ మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు