Homeక్రైమ్బెయిల్ పై విడుద‌లై ఆరుగురిని కిరాత‌కంగా చంపిన ఫొక్సో నిందితుడు...!

బెయిల్ పై విడుద‌లై ఆరుగురిని కిరాత‌కంగా చంపిన ఫొక్సో నిందితుడు…!

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: షాబాద్ మండలం దైవాలగూడలో ఆరుగురి హత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకాండకు తెగబడింది పోక్సో కేసులో రెండు నెలల్లో బెయిల్పై విడుదలైన నిందితుడుగా గుర్తించారు. మే 16వ తేదీన పోక్సో కేసులో బాధిత బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, పోలీసులు మే 26వ తేదీన రిమాండుకు తరలించారు. నిందితుడు రాజ్ కుమార్ కేవలం రూ.20,000 పూచీకత్తుతో రెండు నెలల్లోనే బెయిల్ రావడంతో, బయటికి వచ్చి ఆరుగురిని కిరాతకంగా హతమార్చాడు.

Also Read:ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స – పదేళ్ల నొప్పికి చెక్, కుడి భుజానికి ఆపరేషన్ విజయవంతం

బెయిల్పై తిరిగి వచ్చిన అనంతరం తనపై పోక్సో కేసు పెట్టారని కక్షతో నిందితుడు ఉన్మాదిగా మారాడు. కేసు పెట్టిన బాలికతో పాటు, బాలిక తల్లి, బాలిక నానమ్మలతో పాటు, తన భార్య సరిత, తన ఇద్దరు పిల్లలను కూడా దారుణంగా హతమార్చాడు. కేసు పెట్టిన బాలికను పొలంలోకి తీసుకెళ్లి రేప్ చేసి చంపినట్టు సమాచారం.ఈ విషయం తెలిసి రాజ్ కుమార్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:పెళ్లైనా ఆగని భార్య ప్రేమ వ్యవహారం… మనస్థాపంతో భర్త ఆత్మహత్య

తాజావార్తలు