క్రైమ్ మిర్రర్, సినిమా:- వరుస ఆఫర్లతో టాలీవుడ్‌లో బిజీగా గడుపుతున్న యువ హీరోయిన్ శ్రీలీల.. వెండితెర మీదే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా భారీగా ఆదాయం దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కళ్లు చెదిరే మొత్తాన్ని ఆమె ఆర్జిస్తోంది.తాజా సమాచారం ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీలీల పెట్టే ఒక్క ప్రమోషనల్ పోస్ట్‌కు ఏకంగా రూ. 5 నుంచి 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఆమెకున్న విపరీతమైన ఫాలోయింగే ఇందుకు కారణం. ప్రస్తుతం శ్రీలీలకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1.6 కోట్ల (16 మిలియన్ల) మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే కార్పొరేట్ కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ప్రమోషన్ల కోసం క్యూ కడుతున్నాయి.సినిమాలకు రూ. 3-4 కోట్లు..కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా సినిమాల పరంగా కూడా శ్రీలీల పారితోషికం గట్టిగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు ఆమె రూ. 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన ఈ డ్యాన్సింగ్ క్వీన్, ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బాలీవుడ్ యువ టాలెంటెడ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన ఓ సినిమాలో శ్రీలీల నటిస్తోంది. మొత్తానికి ఒకవైపు వరుస సినిమాలతో, మరోవైపు సోషల్ మీడియా ప్రమోషన్లతో శ్రీలీల కెరీర్ పరంగా దూసుకుపోతోందని చెప్పవచ్చు.
ఏటీఎం కార్డు ఉన్నవారికి శుభవార్త.. రూ.5 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా – ఎలా పొందాలి?
రూ.7 కోట్లతో తీసి రూ.3800 కోట్ల వసూళ్లు… అబ్సెషన్ బాక్సాఫీస్ సంచలనం…!