హైదరాబాద్,క్రైమ్‌మిర్రర్: అమెరికన్ సూపర్‌నేచురల్ సైకాలజికల్ హారర్ చిత్రం అబ్సెషన్ (Obsession) ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం భారీ హాలీవుడ్ సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తూ కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజుల్లోనే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ, పాజిటివ్ మౌత్ టాక్‌తో వసూళ్లలో దూసుకెళ్తోంది. మైఖేల్ జాన్స్టన్, ఇందే నవరెట్టే, కూపర్ టోమిలిన్సన్, మేఘన లాలెస్, ఆండీ రిచర్, కర్రీ బార్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కర్రీ బార్కర్ దర్శకత్వం వహించారు. జేమ్స్ హారిస్, హ్యాలీ నికోల్ జాన్సన్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Also Read:Supreme Court: జడ్జిలపై కేసు పేపర్లు విసిరిన పిటిషనర్.. సుప్రీంకోర్టులో షాకింగ్ ఇన్సిడెంట్!
ఈ చిత్రాన్ని కేవలం 7.5 లక్షల డాలర్లు (సుమారు రూ.7 కోట్ల బడ్జెట్)తో నిర్మించారు. ప్రమోషన్లు కూడా పరిమితంగానే చేసినప్పటికీ, విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన సినిమాకు భారీ ప్లస్‌గా మారింది. ముఖ్యంగా రెండో వారం నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఊపందుకున్నాయి. భారతదేశంలో కూడా ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. తొలి వారంలో రూ.19 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన సినిమా, రెండో వారంలో రూ.31 కోట్లు, మూడో వారంలో రూ.22 కోట్లు, నాలుగో వారంలో రూ.8 కోట్లు, ఐదో వారంలో రూ.3.5 కోట్లు, ఆరో వారంలో రూ.1 కోటి వసూలు చేసింది. మొత్తంగా భారత్‌లో రూ.85 కోట్ల నెట్, రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Also Read:Sheikh Hasina: మరణశిక్ష విధించినా స్వదేశానికే.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!
నార్త్ అమెరికాలో ఈ సినిమా అద్భుత ప్రదర్శన కనబరిచింది. అమెరికా, కెనడాల్లో కలిసి ఇప్పటివరకు 245 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,337 కోట్లకు పైగా) వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టులు చెబుతున్నాయి. త్వరలోనే 250 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక ఇతర దేశాల్లో కూడా ఈ చిత్రం బలమైన వసూళ్లు నమోదు చేసింది. యూకేలో 22 మిలియన్ డాలర్లు, ఫ్రాన్స్‌లో 10 మిలియన్ డాలర్లు, యూఏఈలో 6 మిలియన్ డాలర్లు, జర్మనీలో 3 మిలియన్ డాలర్లు, టర్కీలో 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. నార్త్ అమెరికా మినహా ఇతర దేశాల్లో మొత్తం 158 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.3,800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ చరిత్రలో అరుదైన రికార్డును నమోదు చేసింది.