Crime Mirror, Cinema Latest Updates: నందమూరి నరసింహ స్వామి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైంది. గత కొన్నాళ్లుగా బాలకృష్ణ వారసుడు సినీ రంగ ప్రవేశంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కీలక అప్డేట్ మోక్షజ్ఞ సినీ రంగప్రవేశంపై వచ్చింది.
గతంలో హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాను ప్రకటించారు. అయితే కారణాలు తెలియదు గాని ఆ సినిమా ముందుకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో మరోసారి మోక్షజ్ఞ రంగ ప్రవేశంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలకమైన అప్డేట్ మోక్షజ్ఞ సినిమా రంగ ప్రవేశంపై వచ్చింది.
తన కుమారుడి తొలి సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నందమూరి బాలకృష్ణ ఆ బాధ్యతలను పూర్తిగా తానే చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయిని స్వయంగా ఒక పవర్ఫుల్ లైన్ ను సిద్ధం చేసి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఒకవైపు బాలకృష్ణ తన బాధ్యతలను తాను నెరవేరుస్తూనే మరో సరైన డైరెక్టర్ను వెతికే పనిలో కూడా నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఒక సూపర్ డైరెక్టర్ పేరును ఆయన నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
-
సందీప్ వంగాతో సినిమా చేయించాలని బాలయ్య ఆలోచన..
మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో చేయించారని బాలయ్య భావిస్తున్నట్లు చెబుతున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి చిత్రాలతో ఫేమస్ అయిన సందీప్ రెడ్డి తో మంచి మాస్ సినిమా చేయడం ద్వారా కుమారుడికి మంచి మైలేజ్ వచ్చేలా బాలయ్య ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య సిద్ధం చేసిన స్క్రిప్ట్ ను సందీప్ రెడ్డికి ఇచ్చినట్లు తెలుస్తోంది.
దానిని మరింత వదిలిపెట్టే పనిలో సందీప్ రెడ్డి ఉన్నట్లు పేర్కొంటున్నారు. సాధారణంగానే సందీప్ రెడ్డి సినిమాల్లో హీరోలకు భారీగా ఎలివేషన్స్ ఉంటాయి. కథనం పరంగాను, ఎమోషనల్ చేన్లను తెరకెక్కించడంలో సందీప్ సిద్ధహస్తులు అనే పేరు ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఇదే విషయమై పెద్ద చర్చ జరుగుతోంది.
అన్ని సానుకూలంగా సాగితే కొద్ది రోజుల్లోనే ఈ కాంబినేషన్లో సినిమా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లో వస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ చాలావరకు పూర్తయినట్లు తెలుస్తోంది. స్పిరిట్ మూవీ పూర్తయిన తర్వాత బాలయ్య కుమారుడుతో సందీప్ వంగా చిత్రం చేస్తారా.? లేకపోతే మరో స్టార్ హీరోతో సినిమాను పూర్తి చేసిన తర్వాత బాలయ్య కుమారుడి ప్రాజెక్టును టేకప్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం సినిమా సర్కిల్లో బాలయ్య కుమారుడు తో సందీప్ వంగా సినిమా తీస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది.