క్రైమ్ మిర్రర్ : తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రేమను అంగీకరించలేదనే కోపంతో ఓ విద్యార్థి తన తోటి విద్యార్థినిపై చెప్పుతో దాడి చేశాడు. పాఠశాల ఆవరణలోనే అందరి ముందూ ఈ ఘటన జరగడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న గిరిజన విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు సమాచారం. అయితే అతడి ప్రేమను విద్యార్థిని తిరస్కరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న సదరు విద్యార్థి బుధవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పాఠశాల ప్రాంగణంలోనే చెప్పుతో దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కె. వీరబాబును వివరణ కోరగా.. విద్యార్థినిపై తోటి విద్యార్థి దాడి చేసిన విషయం వాస్తవమేనని తెలిపారు. ఘటన నేపథ్యంలో ఇరువురి తల్లిదండ్రులతో పాటు గ్రామపెద్దలను పాఠశాలకు పిలిపించి మాట్లాడినట్లు వెల్లడించారు. వారి సమక్షంలో సమస్యను పరిష్కరించినట్లు పేర్కొన్నారు.
also read : ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం.. సైబరాబాద్ సీపీకి హైకోర్టు జైలు శిక్ష
