Homeఆంధ్ర ప్రదేశ్నిత్యావసరాల ధరలకు కళ్లెం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

నిత్యావసరాల ధరలకు కళ్లెం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పేదవాడిపై ఏమాత్రం ఆర్థిక భారం పడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సామాన్యులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం, వచ్చే డిసెంబర్ మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీ ధరలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, రేషన్ షాపుల్లో కేవలం రూ. 100 కే కిలో కందిపప్పు, అలాగే రూ. 125 కే లీటర్ పామాయిల్‌ను విక్రయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనివల్ల లక్షలాది మంది పేద కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: హీరో నిఖిల్

అంతేకాకుండా, సామాన్యులకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే అందించేందుకు ఏర్పాటు చేసిన ‘ధరణి’ బియ్యం విక్రయ కేంద్రాల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 286 కేంద్రాలు ఉండగా, వాటిని తక్షణమే 500 కేంద్రాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల మరింత మంది ప్రజలకు సులభంగా బియ్యం అందుబాటులోకి రానున్నాయి.మరోవైపు, సామాన్యుల బడ్జెట్‌ను ప్రభావితం చేస్తున్న కూరగాయల ధరల నియంత్రణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రైతు బజార్ల ద్వారా సరఫరాను పెంచి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఈ చర్యలతో రాష్ట్రంలో ధరలు అదుపులోకి వస్తాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఐపీఎల్ చరిత్రనే తిరగరాస్తాడు.. ఈ సారి రూ.40 కోట్లు పక్కా

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు