Homeక్రైమ్ గచ్చిబౌలి మెన్స్ పీజీలో డ్రగ్స్ కలకలం.. 8 మందికి పరీక్షలు, ఆరుగురికి గంజాయి పాజిటివ్!

 గచ్చిబౌలి మెన్స్ పీజీలో డ్రగ్స్ కలకలం.. 8 మందికి పరీక్షలు, ఆరుగురికి గంజాయి పాజిటివ్!

హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగంపై నిఘా పెంచిన ఈగల్ అధికారులు గచ్చిబౌలిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడి ఓ మెన్స్ పీజీ హాస్టల్‌లో చేపట్టిన సోదాల్లో గంజాయి వినియోగం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.

హాస్టల్‌లో ఉంటున్న ఎనిమిది మందికి అధికారులు డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, వారిలో ఆరుగురికి గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు నగరంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు అధికారులు చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సమాచారం. పీజీ హాస్టళ్లు, ఇతర ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగంపై నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు.

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరంలో డ్రగ్స్ నియంత్రణ కోసం తనిఖీలు మరింత విస్తరించే అవకాశముంది.

also read: ఖమ్మంలో యాసిడ్ గ్యాస్ లీక్ కలకలం.. ముగ్గురికి అస్వస్థత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు