Homeజాతీయందేశంలోకి మళ్ళీ 'గోల్డ్ స్పాట్...! 26 ఏళ్ల తరువాత ఇండియాలోకి...

దేశంలోకి మళ్ళీ ‘గోల్డ్ స్పాట్…! 26 ఏళ్ల తరువాత ఇండియాలోకి…

  • 80వ దశకంలో ఊపేసిన కూల్ డ్రింక్

  • ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తున్న కోకో కోలా

క్రైమ్ మిర్రర్, జనరల్ డెస్క్: దేశీయ కూల్ డ్రింక్ బ్రాండ్లలో గోల్డ్ స్పాట్ ది ప్రత్యేక స్థానం. ఒకప్పుడు కూల్ డ్రింక్ అంటే విదేశీ బ్రాండ్లే గుర్తుకు వచ్చేవి. కానీ భారతీయుల జీవితాల్లో భాగమైన కొన్ని దేశాలు కూడా ఉండేవి. అటువంటి వాటిలో గోల్డ్ స్పాట్ ది ప్రత్యేక స్థానం. ఆరెంజ్ రంగు బాటిల్ పై ఆకర్షణీయమైన లోగో, తాగగానే గుర్తుండిపోయే రుచి.. ఇవన్నీ గోల్డ్ స్పాట్ ను ఒక పానీయంగానే కాకుండా.. ఒక తరం జ్ఞాపకంగా కూడా మార్చాయి. ఈరోజు మార్కెట్లో ఎన్నో రకాల విదేశీ బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ పాత తరం భారతీయులకు గోల్డ్ స్పాట్ పేరు వినిపిస్తే చాలు.. చిన్ననాటి రోజుల గుర్తుకు వస్తాయి. ఇప్పుడు అదే బ్రాండ్ మళ్లీ మార్కెట్లోకి రానుండడం నిజంగా ఆనందించదగ్గ విషయం.

అప్పట్లో ట్రెండ్ సెట్టర్…

1980 బ్యాక్ డ్రాప్ సినిమా అంటే చాలు.. ఒక్క ఫ్రేమ్లో అయినా గోల్డ్ స్పాట్ ను చూపించాల్సిందే. అటువంటి గోల్డ్ స్పాట్ మళ్లీ వస్తుండడం నిజంగా శుభ పరిణామం. ఆ రుచులు మరోసారి పంచబోతోంది. అయితే ఈ గోల్డ్ స్పాట్ కంపెనీ వెనుక గొప్ప చరిత్ర ఉంది. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. కానీ అనుకోకుండా ఆ బ్రాండ్ కనుమరుగయ్యింది. ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తుండడం నిజంగా శుభ పరిణామం. 1952లో గోల్డ్ స్పాట్ ప్రయాణం ప్రారంభమైంది. అప్పట్లో భారతీయ శీతల పానీయాల మార్కెట్లో విదేశీ కంపెనీల ప్రభావం అధికంగా ఉండేది. దేశీయ బ్రాండ్లకు కూడా అవకాశాలు ఉండేవి. ఈ నేపథ్యంలో పార్లే సంస్థ ఆరెంజ్ ఫ్లవర్ తో గోల్డ్ స్పాట్ ను తీసుకొచ్చింది. సమస్త కు చెందిన పార్లే గోల్డ్ స్టార్ పెప్పర్ మెంట్ ఉత్పత్తి పేరు నుంచి ఈ బ్రాండ్ కు పేరు వచ్చింది.

గొప్ప ప్రత్యేకత…

ఆరెంజ్ రంగు, తీయని రుచి, తాగిన తర్వాత నాలుక పై మిగిలే ప్రత్యేకమైన ఫిజ్.. ఇవి గోల్డ్ స్పాట్ కు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ముఖ్యంగా పిల్లలు, యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ బ్రాండ్ క్రమంగా భారతీయ కుటుంబాల్లో భాగమైంది. పుట్టినరోజు వేడుకలు, వేసవి సెలవులు, స్నేహితులతో బయటకు వెళ్లిన సందర్భాలు.. ఇలా అన్నిచోట్ల గోల్డ్ స్పాట్ భాగమయ్యింది. ఆ రోజుల్లో కూల్ డ్రింక్ కొనుక్కోవడం అంటే సాధారణ విషయం కాదు. ఇంట్లో పెద్దవాళ్లు బాటిల్ కొనిస్తే పిల్లలకు పండుగ. షాపు దగ్గర బాటిల్ మూత తీసే శబ్దం నుంచి గ్లాసులో పోసినప్పుడు వచ్చే నురగ వరకు.. ఆ అనుభవంలోనే ఒక ప్రత్యేకమైన ఆనందం ఉండేది. అంతలా అందరి మధ్యలో పెనవేసుకుపోయింది.

ప్రచారంతో మరింత ఊపు…

గోల్డ్ స్పాట్ కు 1980 మధ్యకాలంలో వచ్చిన ది జింగ్ థింగ్ ప్రచారం బ్రాండ్ కు మరింత గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ ప్రకటనల్లో అప్పటి యువతకు నచ్చే ఆధునిక దుస్తులు, ఉత్సాహభరితమైన సంగీతం, డాన్సులు, స్వేచ్ఛగా జీవించే జీవనశైలిని చూపించేవారు. దీంతో గోల్డ్ స్పాట్ కేవలం పిల్లలు తాగే పానీయంగా కాకుండా యువతను ఆకట్టుకునే బ్రాండ్ గా మారింది. లివ్వా లిటిల్ హాట్.. చిప్ప గోల్డ్ స్పాట్ అనే ప్రచార వాక్యంలో కూడా అప్పట్లో ప్రత్యేకంగా నిలిచింది. నటి రేఖ తన కెరీర్ ప్రారంభ దశలో గోల్డ్ స్పాట్ ప్రకటనలో కనిపించడం ఈ బ్రాండ్ చరిత్రలో ఆసక్తికరమైన అంశం. ఆ ప్రకటనకు ప్రముఖ దర్శకుడు బెనెగల్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ ప్రకటనల ద్వారా బ్రాండ్ కు ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సృష్టించడం, వినియోగదారుల్లో భావోద్వేగా అనుబంధాన్ని పెంచడం గోల్డ్ స్పాట్ విజయానికి ప్రధాన కారణాలు. అయితే 1977లో నిబంధనలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో కోకో కోల భారత్ మార్కెట్ నుంచి నిష్క్రమించింది. ఆ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది పార్లే. గోల్డ్ స్పాట్ తో పాటు లిమ్కా, తంసప్ వంటి బ్రాండ్లకు ఆదరణ పెరిగింది. తర్వాత కాలంలో మాజా చేరింది. కోకో కోలా రుచికి భిన్నంగా ఆరెంజ్ ఫ్లేవర్ తో వినియోగదారులను ఆకట్టుకుంది గోల్డ్ స్పాట్.

అయితే భారత మార్కెట్లో 1993లో తిరిగి అడుగు పెట్టింది కోకోకోలా. పార్లే గ్రూప్ కు చెందిన పలు పానీయాల బ్రాండ్లను కొనుగోలు చేసింది. గోల్డ్ స్పాట్ తో పాటు థమ్సప్, లిమ్కా, మాజా, సిట్రా వంటి బ్రాండ్లు కూడా ఈ ఒప్పందంలో భాగస్వామ్యం అయ్యాయి. అయితే గోల్డ్ స్పాట్ కు తర్వాతే ఎదురైన పరిణామాలు అభిమానులను తీవ్ర నిరాశపరిచాయి. గోల్డ్ స్పాట్ కు ఉన్న ఆదరణను తగ్గించే క్రమంలో కోకో కోల ఆ ప్రోడక్ట్ ను నిలిపివేసింది. దీంతో దేశీయ శీతల పానీయ పరిశ్రమ నుంచి గోల్డ్ స్పాట్ కనుమరుగయ్యింది ఫలితంగా గోల్డ్ స్పాట్ ను ఇష్టపడే వినియోగదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు అదే కోకో కోలా కంపెనీ 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గోల్డ్ స్పాట్ డ్రింకును భారతదేశ మార్కెట్లో విడుదల చేస్తుండడంతో.. దానికి ఇష్టపడే వినియోగదారుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. భారత మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని, ఆయన భార్యతో కూడిన గోల్డ్ స్పాట్ క్యాన్ ల చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు: ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
  2. ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులమత రాజకీయాలేనా? సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
  3. ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం.. బరిలో సెహ్వాగ్ తనయుడు!
  4.  తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత: మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు