Homeతెలంగాణవంగవీటి అభిమానుల్లో జోష్...!

వంగవీటి అభిమానుల్లో జోష్…!

  • విజయవాడ మేయర్ గా ప్రమాణ స్వీకారం

  • తన పేరు పై స్పష్టత

  • ఇప్పుడు దానిపైనే చర్చ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : విజయవాడలో సరికొత్త రాజకీయ అధ్యయం. నగర మేయర్ గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణస్వీకారం చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆయన నగరానికి ప్రథమ పౌరుడయ్యారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. 2004లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. వివిధ పార్టీలు మారుతూ చివరకు జనసేన లో చేరి మేయర్ అయ్యారు. దీంతో వంగవీటి అభిమానుల్లో ఒక రకమైన జోష్ నెలకొంది. నగర మేయర్ గా ఎన్నికైన రాధాకృష్ణ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పేరు గురించి ప్రధానంగా చర్చ నడిచింది.

కొత్తగా రాధాకృష్ణన్...

వాస్తవానికి వంగవీటి రాధాకృష్ణ అని ఆయనను పిలుస్తుంటారు. అయితే మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన పత్రంలో మాత్రం పేరు వేరేగా ఉంది. ఆయన తన పేరును వంగవీటి రాధాకృష్ణ అని కాకుండా.. వంగవీటి రాధాకృష్ణన్ అని చదివారు. ఆయనకు తల్లిదండ్రులు పెదనాన్న రాధాకృష్ణమూర్తి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టారు. అయితే ఆయన తమిళనాడులోని ఊటీ స్కూల్లో చదువుకునే సమయంలో.. అక్కడి రికార్డుల్లో ఆయన పేరును రాధాకృష్ణన్ గా నమోదు చేశారు. అలా నమోదు కావడంతో రాధాకృష్ణన్ గాని కొనసాగుతూ వస్తోంది. వివిధ సందర్భాల్లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లలో సైతం రాధాకృష్ణన్ గానే ఉంది. అంతేకాదు ఎన్నికల ప్రచార సమయంలో కూడా కొంతమంది రాధాకృష్ణన్ గా ప్రస్తావించారు. కాబట్టి ఆయన పేరు రాధాకృష్ణ కాదు.. రాధాకృష్ణన్.

మంచి నేపథ్యం…

ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగాది ప్రత్యేక స్థానం. కాపు సామాజిక వర్గంతో పాటు అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. అప్పట్లోనే ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. 1988లో దారుణ హత్యకు గురయ్యారు. అప్పటికి రాధాకృష్ణ చిన్నవాడు. అప్పట్లో టిడిపి ప్రభుత్వం ఉండగా ఈ ఘటన జరిగింది. అందుకు అప్పటి టిడిపి 1989లో జరిగిన ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి వంగవీటి మోహన్రంగా పేరు వినిపిస్తూనే ఉంటుంది. అయితే చాలా చిన్న వయసులోనే 2004లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు రాధాకృష్ణ. పాదయాత్ర చేసిన రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. అయితే 2009 ఎన్నికల నాటికి ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి ఎదురయింది. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. మొన్నటి వరకు అదే పార్టీలో ఉండి జనసేనలోకి జంప్ అయ్యారు. ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు: ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
  2. ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులమత రాజకీయాలేనా? సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
  3. ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం.. బరిలో సెహ్వాగ్ తనయుడు!
  4.  తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత: మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు