కాకినాడ, క్రైమ్‌మిర్రర్: గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం పారాదీప్ సముద్ర జలాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. మత్స్యకారుల ఆచూకి కనిపెట్టి క్షేమంగా తీసుకరావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలోని యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన యజమానితో సహా ఏడుగురు మత్స్యకారులు ఉప్పాడ సముద్ర తీరం నుంచి ఈ నెల 11న సిహాంద్రీ అనే బోటులో ఒడిస్సా రాష్ర్టం పూరి సమీపంలో పారదీప్ తీరానికి చేపలవేటకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కాగా ఈనెల 11న ఇంటికి ఫోన్ చేసి తామున్న ప్రాంతంలో తుఫాన్ ఉన్నట్లు పేర్కొన్నారు. తరువాత నుంచి ఫోన్ కమ్యూనికేషన్ కట్ అవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.మత్స్యకారులు ఆచూకీ కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో ఏపీ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. తుపాను ప్రభావంతో బోటు ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గల్లంతైన బోటు ఆచూకీ కోసం బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు కూడా సమాచారం అందించారు. బోటులో 1,500 లీటర్ల డీజిల్, 30 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మత్స్యకారుల కోసం ప్రత్యేక చర్యలు…
కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్, చెన్నై ఎమ్‌ఆర్‌సీసీ సమన్వయంతో విస్తృతంగా గాలింపు జరుగుతోందన్నారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని.. బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
ఇవి కూడ చదవండి:
-
తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు: ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
-
ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులమత రాజకీయాలేనా? సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
-
ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం.. బరిలో సెహ్వాగ్ తనయుడు!
-
తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత: మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న ముప్పు
