Homeతెలంగాణబంగారం మరింత చౌకగా..!

బంగారం మరింత చౌకగా..!

  • భారీగా ధర పతనం

  • గరిష్ట స్థాయి నుంచి దాదాపు 30 నుంచి 32 శాతం తగ్గుదల

  • అంతర్జాతీయ వ్యవహారాలే కారణం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: బంగారం ధర రికార్డు స్థాయిలో పతనం దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో రూ. 1.80 లక్షలు దాటిన బంగారం ధర.. ఇప్పుడు వరుసగా పతనం అవుతూ సామాన్య కొనుగోలుదారుడుకు ఊరట నిస్తోంది. కానీ ఇన్వెస్టర్లను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.22 లక్షల స్థాయికి పడిపోయింది. గరిష్ట స్థాయి నుంచి దాదాపు 30 నుంచి 32 శాతం మేర దిగి వచ్చింది. కమోడిటీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ పతనానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడానికి బదులు మళ్లీ పెంచే అవకాశాలు ఉండడం.. డాలర్ విలువ 19 నెలల గరిష్టానికి చేరి అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, డాలర్ తో పోలిస్తే భారత రూపాయి బలపడడం.. వీటికి తోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఏఐ షేర్ల పతనం వల్ల నగదు అవసరాల కోసం ఇన్వెస్టర్లు బంగారం పెట్టుబడులను విక్రయించడం కూడా ధరలపై తీవ్ర ఒత్తిడిని తెచ్చి పెట్టింది.

లక్షకు తక్కువగా…

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధరకు 3500 డాలర్ల వద్ద బలమైన మద్దతు ఉంది. ఒకవేళ ఆ స్థాయిని దాటి కిందకు పడిపోతే 3300 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,17,500 స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధర లక్షలు కంటే దిగువకు పడిపోయే అవకాశాలు చాలా తక్కువ. ప్రస్తుత ధరలు ఓవర్ సోల్డ్ జోన్ లో ఉన్నందున పెళ్లిళ్ల సీజన్ కొనుగోలు, వాల్యూ బయింగ్ వల్ల త్వరలో తిరిగి కోలుకునే అవకాశం ఉంది.

వచ్చే ఏడాది చివరి నాటికి…

మరోవైపు 2027 చివరి నాటికి బంగారం ధరలు మళ్ళీ పైకి ఎగబాకుతాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు గోల్డ్ మన్ సాక్స్ రాజా నివేదిక ప్రకారం సమీప భవిష్యత్తులో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వల్ల ఒత్తిడి ఉన్నప్పటికీ.. 2027 చివరి నాటికి వడ్డీ రేట్ల తగ్గింపు మొదలవుతుందని.. చైనా సహా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు సాగుతూ ఉండడంతో 2027 నాటికి ఔన్స్ బంగారం 4650 డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇక దేశీయ మార్కెట్ అంచనా ప్రకారం 2027లో 10 గ్రాముల బంగారం తిరిగి రూ.1.60 లక్షల నుంచి రూ.1.80 లక్షల శ్రేణిలోకి చేరే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధరల్లో ప్రస్తుత తగ్గుదల కేవలం అంతర్జాతీయ వడ్డీ రేట్లు, డాలర్ కదలికల వల్ల ఏర్పడిన తాత్కాలిక సర్దుబాటు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు: ద్రోణి ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో వర్షాలు!
  2. ప్రపంచం AI వైపు పరుగులు తీస్తుంటే ఇంకా కులమత రాజకీయాలేనా? సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే
  3. ఐపీఎల్ 2027 వేలానికి రంగం సిద్ధం.. బరిలో సెహ్వాగ్ తనయుడు!
  4.  తెలంగాణలో ఆందోళన కలిగిస్తున్న రక్తహీనత: మహిళలు, చిన్నారుల్లో పెరుగుతున్న ముప్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు