బీహార్‌లో వెలుగుచూసిన ఓ దారుణ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన భర్తనే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళిక రూపొందించి, కిరాయి హంతకులకు డబ్బులు ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని పాట్నా జిల్లా సిమ్రి గ్రామానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ ఇమామ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఫౌజియా ఫిర్దోస్‌కు కరణ్ కుమార్ అనే వ్యక్తితో గత రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ భార్యను నిలదీయడంతో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి.
ఈ క్రమంలో భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన ఫౌజియా, ప్రియుడు కరణ్ కుమార్‌తో కలిసి అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందుకోసం భర్త బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తీసి కిరాయి హంతకులకు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం పథకం ప్రకారం ఇర్ఫాన్‌ను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు.
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫౌజియాను విచారించగా, ఆమె నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఫౌజియా ఫిర్దోస్‌తో పాటు ఆమె ప్రియుడు కరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ హత్యలో పాల్గొన్న కిరాయి హంతకుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
also read: విశ్వసుందరిగా జెన్నిఫర్ బారెటో…!
