Homeక్రైమ్నంద్యాలలో ఘోర విషాదం.. సోలార్ బ్యాటరీ పేలి ఐదేళ్ల బాలుడు సజీవదహనం!

నంద్యాలలో ఘోర విషాదం.. సోలార్ బ్యాటరీ పేలి ఐదేళ్ల బాలుడు సజీవదహనం!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోలార్ ప్యానెల్ బ్యాటరీలో చోటుచేసుకున్న షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గుడిసెలో మంటలు చెలరేగి ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే బిడ్డ మంటల్లో చిక్కుకోవడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది.

వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం బలపాలతిప్ప గ్రామానికి చెందిన గిరిజన దంపతులు కాట్రాజు ఈరన్న, భారతమ్మలకు ఇద్దరు కుమారులు. మంగళవారం చిన్న కుమారుడు ధర్మకిరణ్ (5)ను తల్లి గుడిసెలో నిద్రపుచ్చి ఇంటి పనుల్లో నిమగ్నమైంది.

అదే సమయంలో గుడిసెలో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ బ్యాటరీలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించి పేలుడు చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి గుడిసె మొత్తం అగ్నికి ఆహుతైంది. ప్రమాదం జరిగిన సమయంలో లోపలే ఉన్న చిన్నారి ధర్మకిరణ్ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు.

మంటలను గమనించిన తల్లి భారతమ్మ తన కుమారుడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో లోపలికి వెళ్లలేకపోయింది. తన కళ్ల ముందే కుమారుడు అగ్నికి ఆహుతి కావడంతో ఆమె గుండెలవిసేలా రోదించింది.

also read: బరువు తగ్గించే ఇంజెక్షన్ల పేరుతో భారీ మోసం.. హైదరాబాద్‌లో ముఠా గుట్టురట్టు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు