Homeక్రైమ్ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం.. సైబరాబాద్ సీపీకి హైకోర్టు జైలు శిక్ష

ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం.. సైబరాబాద్ సీపీకి హైకోర్టు జైలు శిక్ష

క్రైమ్ మిర్రర్ : తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు రెండు వారాల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి కూడా రెండు వారాల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఈ శిక్ష అమలును వారం రోజుల పాటు హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ గడువులోగా సంబంధిత ఉత్తర్వులు పొందకపోతే హైకోర్టు రిజిస్ట్రార్ ముందు లొంగిపోయి శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. అలాగే విధించిన జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో వారం రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది.

ఓ భూ వివాదానికి సంబంధించి పిటిషనర్‌కు పోలీసు రక్షణ కల్పించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఉత్తర్వుల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
also read : దాబాలో భోజనం చేస్తుండగా కాల్పులు.. నలుగురు యువకులు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు