Homeతెలంగాణరాహుల్ సెంటిమెంట్ పాలిటిక్స్...!

రాహుల్ సెంటిమెంట్ పాలిటిక్స్…!

  • తండ్రి మరణాన్ని గుర్తుచేస్తూ సానుభూతికి ప్రయత్నం

  • రాజీవ్ హత్య సమయంలో భద్రత తగ్గించాలని ఆరోపణ

  • ప్రత్యేక వీడియో విడుదల

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : కాంగ్రెస్ జాతీయస్థాయిలో పుంజుకోవాలని చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సానుభూతి రాజకీయాలను నమ్ముకున్నారు. తాజాగా తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అంశాన్ని తెరపైకి తెస్తూ సానుభూతి రాజకీయాలకు తెర లేపారు. తన తల్లి సోనియా గాంధీ రచించిన ఆత్మకథ బి లాగింగ్ పుస్తకావిష్కరణ తర్వాత ప్రమోషన్ల కోసం.. సోనియా, ప్రియాంక గాంధీ లతో కలిసి కూర్చొని మాట్లాడిన ఒక ప్రత్యేక వీడియోను రాహుల్ గాంధీ విడుదల చేశారు. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడానికి ముందు ఆయనకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ.. కావాలనే కుట్రపూరితంగా భద్రతను తగ్గించారని.. ఆయన హత్యకు అనుకూల వాతావరణం సృష్టించారని రాహుల్ గాంధీ ఆ వీడియోలో ఆరోపణలు చేశారు. 1991లో బీహార్ ఎన్నికల ప్రచార పర్యటనలో రాజీవ్ గాంధీ ప్రయాణిస్తున్న ఓపెన్ జీప్ పై రాళ్లు విసిరిన ఘటనను.. సోనియా గాంధీ గుర్తుచేసుకోగా.. అప్పుడే తన తండ్రి భద్రతపై తాను ఆందోళన చెంది తండ్రితో వాదించానని రాహుల్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

గతంలో ఇదే పంధాతో…

సానుభూతితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భాలు అధికం. 1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత కానీ.. 1991లో రాజీవ్ గాంధీ విషాదకరమరణం తర్వాత కానీ.. ఆ సానుభూతి పవనాలను కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా ఓట్లుగా మలుచుకుని అధికారాన్ని దక్కించుకుంది. అయితే రాజీవ్ గాంధీ హత్య జరిగి దాదాపు మూడున్నర దశాబ్దాలు గడిచిపోయాయి. అయితే ప్రస్తుత తరం వాటర్ లను ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీ మళ్లీ అదే పాత సానుభూతి కార్డును బయటకు తీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వం ఎస్పీజీ భద్రత ను ఉపసంహరించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. చట్టపరంగా జరిగిన మార్పులను సైతం ఏదో పెద్ద రాజకీయ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వెనుక.. రాబోయే ఎన్నికల వ్యూహాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం.

భిన్న వాదన…

అయితే రాహుల్ ఎంచుకున్న మార్గంపై భిన్న వాదన వినిపిస్తోంది. వర్తమాన రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడంలో.. ప్రజల్లో బలమైన భరోసా నింపడంలో తడబడుతున్న రాహుల్ గాంధీ.. ఈ తరహా భావోద్వేగా వీడియోలతో సానుభూతి పొందేందుకు చేస్తున్న ప్రయత్నాలు కాస్త అతిగా ఉన్నాయి. 2004లో ప్రధాని పదవిని సోనియా గాంధీ త్యాగం చేశారంటూ పాత జ్ఞాపకాలను, వ్యక్తిగత దాడులను మళ్ళీ మళ్ళీ తవ్వి తీయడం ద్వారా.. గాంధీ కుటుంబం చుట్టూ సానుభూతి వలయాన్ని నిర్మించాలని చూస్తున్నా.. నేటి యువ వాటర్ల పాత చరిత్ర కంటే భవిష్యత్ ప్రణాళికలకే ప్రాధాన్యత ఇస్తారన్న వాస్తవాన్ని కాంగ్రెస్ విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక ఇంటి పెద్దగా, తండ్రి మరణం ఏ కుటుంబానికైనా తీరని విషాదమే. కానీ దానిని 35 ఏళ్ల తర్వాత కూడా రాజకీయ అస్త్రంగా వాడుకోవాలని చూడడం కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  నిత్యావసరాల ధరలకు కళ్లెం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
  2. ఐపీఎల్ చరిత్రనే తిరగరాస్తాడు.. ఈ సారి రూ.40 కోట్లు పక్కా
  3.  చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: హీరో నిఖిల్
  4.  యువతకు 66 శాతం సీట్లు.. ఉగాది నుంచి పాదయాత్రకు సిద్ధం: విజయసాయిరెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు