ఆదివారం తెల్లవారుజామున విశాఖపట్నం(వైజాగ్) నగరంలో భూ ప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. సాగర్‌నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు స్పష్టంగా గుర్తించబడ్డాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రిక్టర్ స్కేలు ప్రకారం ఈ భూకంప తీవ్రత సుమారు 4.5గా నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే భూకంపం కారణంగా కొంతసేపు ప్రజలు ఆందోళనలో గడిపారు. అధికారులు పరిస్థితిని పరిశీలిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
also read: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై FSSAI కఠిన చర్యలు.. గడువు ముగిసిన ఆహార సరఫరాపై 9 నోటీసులు