క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం:- అందాల దివి వియత్నాంలో పర్యాటకుల ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడడంతో 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకోగా.. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన పదిమంది, ఏపీకి చెందిన ముగ్గురు, కేరళకు చెందిన ఇద్దరు మృత్యువాత చెందినట్లు భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఈ దుర్ఘటన నుంచి 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వియత్నాంలో అతిపెద్ద జీవి పూ క్వాక్ పర్యాటక ఆకర్షణలో ఒకటిగా పేరుగాంచింది. లావా మొబైల్ సంస్థ తమ కంపెనీకి చెందిన డీలర్లను విదేశాలకు టూర్ నిమిత్తం తీసుకువెళ్ళింది. మొత్తం 36 మందితో ఒక స్పీడ్ బోటు పూ క్వాక్ దేవికి వచ్చింది. ఇందులో నలుగురు సిబ్బంది కాగా మొత్తం 32 మంది భారతీయ పర్యాటకులు ఇందులో ఉన్నారు. దీవిలో పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీరానికి సుమారు 400 మీటర్ల దూరంలోనే పర్యాటకు పోటు తిరగబడిపోవడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం గమనించిన సమీపంలోని ఇతర బోట్లకు చెందిన సిబ్బంది వెంటనే సాయం అందించే ప్రయత్నం చేయడంతో కొంతమందిని ప్రాణాలతో కాపాడగలిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాద విషయం తెలిసిన నౌకాదళం, తీర గస్తీ దళం, ఇతర బృందాలు అక్కడకు చేరుకొని కొందరిని రక్షించి తీరానికి చేర్చి ప్రథమ చికిత్స అందించారు. తిరగబడిన బోటు కింది భాగంలో పలువురు చిక్కుకోవడంతో సహాయక చర్యలు కష్టమయ్యాయి అని ప్రత్యక్ష సాక్షులు వెల్లడిస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు మృతి చెందినట్లు నిర్ధారించిన 15 మందిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.
నాని నిర్మాణంలో నితిన్-రుక్మిణి వసంత్!
పెద్ద కెరటం రావడంతో తిరగబడిన బోటు..
అప్పటివరకు బోటులో సాఫీగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా కుదుపులకు లోనయింది. ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున కెరటాలు రావడంతో బోటు అదుపుతప్పి బోల్తా పడినట్లు పర్యాటకుల్లో ఒకరు వెల్లడించారు. ముందు భాగాన తాము ఉన్నందున బయటపడగలిగామని, వెనుక వైపు ఉన్నవాళ్లు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్లు అదే పడవలో ప్రయాణం సాగించిన మన కొంతమంది పర్యాటకులు వెల్లడించారు. ప్రమాదంపై వియత్నాం ప్రధాని విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరో తేల్చి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో ఇటువంటి పర్యాటక ప్రాంతాల్లో రక్షణ ఏర్పాట్లపై వెంటనే సమీక్షించాలని కూడా ఆదేశించారు. ఈ ప్రమాదం విషయం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపాన్ని తెలియజేశారు. భారతీయ పర్యాటకులు మృతి రాష్ట్రపతి ద్రౌపది మురుము కూడా తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. వియత్నాం సర్కార్తో కలిసి బాధ్యత కుటుంబాలకు అన్ని విధాల సాయపడాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరారు. ఇకపోతే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిది ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ. అప్పటివరకు పర్యాటక ప్రాంతంలో ఎంతో ఆనందంగా గడిపిన వారంతా కొద్ది క్షణాల్లో తీరానికి చేరుకుంటారు అనుకునే సమయానికి ఈ ప్రమాదం సంభవించడం, ఎంతోమంది ప్రాణాలను తీయడం వారి కుటుంబాలను శోకానికి గురిచేసింది. వారితో ప్రయాణం చేసి ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారంతా వారితో గడిపిన క్షణాలను తలుచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స.. మరో రెండు నెలల్లో రెండో ఆపరేషన్!