Homeసినిమాహైదరాబాద్‌లో హీరో ఆర్యకు షాక్.. చీటింగ్ కేసు నమోదు

హైదరాబాద్‌లో హీరో ఆర్యకు షాక్.. చీటింగ్ కేసు నమోదు

క్రైం మిర్రర్ : ప్రముఖ తమిళ నటుడు ఆర్యతో పాటు ఓ సినిమా నిర్మాణ సంస్థ ప్రతినిధులపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా చిత్రీకరణ కోసం అద్దెకు తీసుకున్న ప్రొడక్షన్ పరికరాలకు సంబంధించిన చెల్లింపులు చేయలేదని ఆరోపిస్తూ తాహేర్ సినీ టెక్నిక్ సంస్థ ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు ప్రకారం, ‘అనంతన్ కాడు’ సినిమా నిర్మాణ సమయంలో ఆధునిక డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లు తదితర పరికరాలను అద్దెకు తీసుకున్నారు. ఇందుకోసం గత ఏడాది ఫిబ్రవరి 25న ఒప్పందం కుదుర్చుకుని, హైదరాబాద్ నుంచి కేరళకు పరికరాలను పంపించారు. మొత్తం అద్దె రూ.2.12 కోట్లకు చేరగా, అందులో రూ.42 లక్షలు మాత్రమే చెల్లించారని, ఇంకా రూ.1.80 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని సంస్థ ఆరోపించింది.

ఈ విషయమై పలుమార్లు లేఖలు, వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించినా ఎలాంటి స్పందన రాలేదని సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా విడుదలకు ముందు ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకుంటామని చెప్పినా, ఆ హామీ కూడా నెరవేర్చలేదని తెలిపారు.

అంతేకాకుండా, బకాయిల విషయమై సంప్రదించగా తమ సంస్థ ప్రతినిధులను బెదిరించారని కూడా ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
also read :కంభం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా నలుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు