Homeక్రీడలుహైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఘన విజయం: TG20 2026 ఛాంపియన్ గా అవతరణ!

హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఘన విజయం: TG20 2026 ఛాంపియన్ గా అవతరణ!

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ క్రికెట్ లీగ్ (TG20 2026) లో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ పై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఖమ్మం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం 158 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. మరో 14 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సగర్వంగా కప్పును కైవసం చేసుకుంది.హైదరాబాద్ బ్యాటర్లలో అభిరథ్ రెడ్డి 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వైష్ణవ్ రెడ్డి (41 నాటౌట్), అశ్విన్ (36) అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ కు రూ. కోటి ప్రైజ్‌మనీ దక్కగా, రన్నరప్‌గా నిలిచిన ఖమ్మం ఏసెస్ రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ అందుకోనుంది. ఈ అద్భుత విజయంతో హైదరాబాద్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.

రెండు వేలు విత్ డ్రా కోసం వెళితే.. ఖాతాలో 740 కోట్లు డబ్బు

మాస్క్ తో మంత్రి బస్సు ప్రయాణం… చిల్లర లేవన్నందుకు దిగిపోమన్న కండక్టర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు