Homeఅంతర్జాతీయంపశ్చిమ బెంగాల్లో భారీ అగ్ని ప్రమాదం...15 మంది...!

పశ్చిమ బెంగాల్లో భారీ అగ్ని ప్రమాదం…15 మంది…!

Crime Mirror, Latest Updates: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దీయా రిఫైనరీలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాస్తా రవాణా కోసం ఉపయోగిస్తున్న పైప్ లైన్ లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ప్రమాదం తర్వాత అగ్నికేలలో ఎగిసిపడడంతో మంటలు జోరుగా వ్యాప్తి చెందాయి.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ ఘటనలో సుమారు 15 మంది వరకు గాయపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గాయపడిన వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. స్థానికులు, పోలీసులు వెల్లడించిన వివరాలు ప్రకారం మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో నాస్తా తరలిస్తున్న పైపులైన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

చెలరేగిన మంటలు కూడా కొద్ది క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాప్తి చెందడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో కనిపించిన దాని ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని, ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. సాంకేతిక లోపం వలన ప్రమాదం జరిగిందా లేదా అన్న కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ సాగిస్తున్నారు.

  • ఆసుపత్రులకు బాధితులు తరలింపు..

ఈ ప్రమాదంలో సుమారు 15 మంది వరకు కార్మికులు గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిని దగ్గరలోని హల్దియా సబ్ డివిజన్ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలను అందిస్తున్నారు. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి మెరుగైన వైద్య సేవలను అక్కడ వైద్య సిబ్బంది అందిస్తున్నారు.

ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం వల్ల రఫైనరీ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఇకపోతే ఈ ప్రమాదానికి గల కచ్చితంగా కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పైప్ లైన్ లో సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా, లీకేజీ కారణమా లేదా ఇతర కారణాలు ఉన్నాయా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. రిఫైనరీ ఉన్నతాధికారులు కూడా దీనిపై విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. నిపుణులతో కూడిన బృందాన్ని విచారణకు ఏర్పాటు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు