అల్లూరిసీతారామరాజు జిల్లా, క్రైమ్‌మిర్రర్: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఓ చిన్నారి చేతులపై వాతవలు పెట్టిన అమానుష ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. రూ. 10వేలు దొంగతనం చేసిందనే నెపంతో 8 ఏళ్ల బాలికపై కనికరం లేకుండా అట్లకాడతో చేతులపై వాతలు పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:హైదరాబాద్‌లో నిరుద్యోగుల ఆందోళన: పోలీసు నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీకే వీధి మండలం ధారకొండ పంచాయతీ పరిధిలోని ఏనుగుబైలు గ్రామానికి చెందిన వసంత (8) అనే బాలిక గత 10 నెలలుగా స్థానిక పాస్టర్ జయిరాజ్ సంరక్షణలో ఉంటూ చదువుకుంటోంది. బాలిక విద్యాభ్యాసం, సంరక్షణ బాధ్యతలను పాస్టర్ కుటుంబం చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో రూ.10 వేల నగదు కనిపించకపోవడంతో బాలికపై అనుమానం వ్యక్తమైంది. పాస్టర్ జయిరాజ్ ఇంటి పక్కనే నివసించే రూపావతి అనే మహిళ, బాలికే డబ్బు తీసి ఉంటుందని అనుమానించి ఆమెపై దారుణంగా ప్రవర్తించింది. వేడి అట్లకాడతో బాలిక చేతులపై వాతలు పెట్టడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.
Also Read:విషాదం… గోడకూలి ముగ్గురు కూలీల మృతి…! పలువురికి గాయాలు…
బాలిక చేతులపై కాలిన గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన జరుగుతున్న సమయంలో పాస్టర్ దంపతులు రూపావతిని అడ్డుకోలేదని, కనీసం ప్రశ్నించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టంతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కేసులు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:కరోనా వెనుక అమెరికా పాత్ర? ఐదేళ్ల తర్వాత మళ్లీ రగులుతున్న ‘వ్యూహాన్ ల్యాబ్’ వివాదం!