Crime Mirror, Politics Updates: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గడచిన ఎన్నికల్లో మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన సీఎం విజయ్ భవిష్యత్తు రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకులను తన పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమిళనాడులో తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంపై ఆయన ప్రధానంగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంటున్న పరిణామాలు సీఎం విజయ్ ఆపరేషన్ ఆకర్ష్ ను బహిర్గతం చేసినట్లు చెబుతున్నారు.
Also Read: Nagabandham Movie Review, Rating, Public Talk and Audience Response..! – Crime Mirror
ఈ క్రమంలోనే తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) కు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వందలాదిమంది కీలక నేతలు సీఎం విజయ్ పార్టీకి చెందిన టీవీకేలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చి నియాంశంగా మారింది. ఈ జాబితాలో ఐదుగురు మాజీ మంత్రులు, 15 మంది వరకు మాజీ ఎమ్మెల్యేలు, వందల సంఖ్యలో జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే వారితో టీవీకేకు చెందిన ముఖ్య నాయకులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. వీరిలో సీనియర్ నేతలుగా భావిస్తున్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు సీఎం విజయ్ సిద్ధంగా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు వారికి రాయభారాన్ని పంపించినట్లు చెబుతున్నారు.
Also Read: రోనాల్డోకి ఇదే చివరి వరల్డ్ కప్.. హింట్ ఇచ్చిన సోదరి! – Crime Mirror
సీఎం విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారిలో మాజీ మంత్రులు సి విజయభాస్కర్, ఎమ్మార్ విజయభాస్కర్, ఎం ఎస్ ఎం ఆనందన్, ఎస్ వలర్మతి వంటి ప్రముఖ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఇప్పటికే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి టీవీ క్యూలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అసెంబ్లీలో అన్నాడీఎంకే బలం కూడా క్రమంగా తగ్గుముఖం పట్టనుంది.
-
ఆపరేషన్ అన్నాడీఎంకే అన్నట్టుగా చేరికలు..
తమిళనాడులో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్నా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే సీఎం విజయ్ తన పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వరుసుగా టీవీ కేవైపు వెళుతున్నారు.
Also Read: తెలంగాణలో ఈ బస్సులు బంద్.. తక్షణమే ఆదేశాలు అమల్లోకి!! – Crime Mirror
ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు విజయ సమక్షంలో టీవీకేలో చేరారు. తాజా చేరికలతో ఈ వలసలు మరింత వేగం పుంజుకున్నట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వరుసగా సీనియర్ నేతలు పార్టీని వీడడం, సీనియర్ నేతల నిష్క్రమణ అన్నా డీఎంకే సంస్థ గత బలంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా జిల్లా స్థాయిలో ప్రభావం ఉన్న నాయకులు పార్టీని మేడటం వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ పై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో క్షేత్రస్థాయిలో కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు టీవీకే వైపు చూసే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే కొన్నేళ్లుగా తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన అన్న డీఎంకే పార్టీ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం…!టీచర్లకు బ్రేక్ ఫాస్ట్…లంచ్… – Crime Mirror
Also Read: ‘జిహాదీ’ వ్యాఖ్యల వివాదం: నటుడు టిని టామ్‌పై కేసు నమోదు చేయాలన్న కోర్టు – Crime Mirror