వికారాబాద్, క్రైమ్ మిర్రర్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జిన్గుర్తి గ్రామ శివారులో ఉన్న గిరిజన బాలికల వసతి గృహంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపింది. హాస్టల్లో ఉంటూ ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి హాస్టల్ భవనం పై నుంచి దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమె కాలుకు తీవ్ర గాయమై ఎముక విరగడంతో తొలుత స్థానికంగా ఉన్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి లో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
Also Read:ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యభర్తల బలవన్మరణం- అనాథగా మారిన ఐదు నెలల శిశువు
విద్యార్థిని భవనం పై నుంచి ఎందుకు దూకింది అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ సమస్యల కారణంగానా, లేక ఇతర వ్యక్తిగత లేదా విద్యాసంబంధిత కారణాలున్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు హాస్టల్‌ను సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థినితో పాటు హాస్టల్ సిబ్బంది, తోటి విద్యార్థుల నుంచి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. విచారణ అనంతరం అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read:హైదరాబాద్‌లో నిరుద్యోగుల ఆందోళన: పోలీసు నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్