హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: మాదాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో ఓ విద్యార్థిని ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయ్యప్ప సొసైటీలోని సరస్వతి క్యాంపస్ లో ఇంటర్ ఫస్టియర్ పూర్తిచేసుకున్న పూజా రెడ్డి ఎగ్జామ్స్ ఒత్తిడి తట్టుకోలేక తన రూమ్ లో ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు తండ్రి ఫిర్యాదు తో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతురాలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపిసి చదువుతోంది.
నిన్న రాత్రి హాస్టల్లోని మూడో అంతస్తు గది నెంబర్ 305లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడింది. నల్గొండ జిల్లాకు చెందిన పూజ రెడ్డి ఇక్కడే ఉంటూ శ్రీ చైతన్య కాలేజీ లో చదుకుంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలో 389 మార్కులు రావడంతో డిప్రెషన్ కు లోనైంది. తన ఇంటి నుండి రెండు రోజులు క్రితం శ్రీ చైతన్య హాస్టల్ కు వచ్చింది. పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృత దేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.