.కడప, క్రైమ్ మిర్రర్: భార్య లావుగా ఉందని భర్త విషమిచ్చి చంపేసిన ఘటన ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లో భద్రిపల్లె పద్మ ను ఆమె భర్త బద్రి పల్లి కిరణ్ విషమిచ్చి చంపిన కేసులో భర్తను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ విభూ కృష్ణ తెలిపారు. ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
భార్య లావుగా ఉందని , ఎక్కువ తిండి తింటుందని దానివల్ల చంపినట్లు చెప్పారన్నారు. ఎనిమిదేళ్ల క్రితం వివాహమైందని భద్రిపల్లె కిరణ్ ముద్దనూరులోని వారి మామ ఇంటిలోనే ఉంటున్నాడని , ఏడు సంవత్సరాల కుమార్తె కూడా ఉందన్నారు. భార్యని ఎలాగైనా చంపాలని భావించిన భద్రి పల్లి కిరణ్ నెట్లో సెర్చ్ చేసి 80 వేలు విలువచేసే విష పదార్థాన్ని తెప్పించారన్నారు.
భార్యను ప్రొద్దుటూరు మండలం ఈశ్వర్ రెడ్డి నగర్ లోని కిరణ్ తల్లిదండ్రుల ఇంటికి గత నెల 26వ తేదీన తీసుకొచ్చారన్నారు. విషాన్ని 29వ తేదీ రాత్రి భార్యకి విషమిచ్చి , ఆమె పడిపోయాక దిండు అదిమిపట్టి ఊపిరాడకుండా చేశారన్నారు. అతనికేమీ తెలియనట్లు భార్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారని వివరించారు. మృతురాలు తండ్రి ముద్దనూరు పట్టణానికి చెందిన బెంగుళూరు రాజకుల్లాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారని , విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొన్నారు..