ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మహిళా కార్మికులను తరలిస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఏటికొప్పాక నుంచి అచ్యుతాపురం పారిశ్రామిక ప్రాంతానికి మహిళా ఉద్యోగులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.
ప్రమాద తీవ్రతను గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేసి, అందులో ఉన్న ఐదుగురు మహిళా కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై పరిశీలన కొనసాగుతోంది.
also read: దుబాయ్‌లో హైదరాబాద్ యువతి అదృశ్యం.. నాలుగు నెలలుగా ఆచూకీ లేక కుటుంబంలో ఆందోళన
