హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల వైద్య విద్యార్థిని దుబాయ్‌లో అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన యువతి ప్రస్తుతం కనిపించకపోవడంతో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం… వైద్య విద్య పూర్తి చేసిన యువతి గత ఏడాది ఉద్యోగ అవకాశాల కోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ ఓ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరిన ఆమె, కొంతకాలం పాటు క్రమం తప్పకుండా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడేది.
అయితే గత నాలుగు నెలలుగా ఆమె నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదు. ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, మొబైల్ ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
ఈ ఘటనపై రాచకొండ పరిధిలోని ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువతి దుబాయ్‌లో ఎక్కడ ఉంది? ఆమెకు ఏమైంది? అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
also read: కన్న కొడుకునే చంపేందుకు ప్రయత్నం.. హైదరాబాద్‌లో తండ్రి దారుణం
